PM Surya Ghar Muft Bijli Yojana : సౌరశక్తితో విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఈ సోలార్ కరెంటుపై చాలా మందికి ఆసక్తి ఉండదు. ఇదెంత ప్రయోజనకరమైనా దీనిపై ఇంట్రెస్టు చూపరు. అతి తక్కువ ఖర్చుతో గృహోపయోగాలకు విద్యుత్తును పొందొచ్చని తెలిసినా దీని వైపు మొగ్గు చూపరు. ఇన్‌స్టాలేషన్‌కు అయ్యే ఖర్చుకు భయపడి చాలా మంది సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకొనేందుకు ముందుకురారు.
అయితే.. ఇక ఇలాంటి ఇబ్బందులు ఉండబోవంటోంది కేంద్ర ప్రభుత్వం. ‘పీఎం సూర్యగృహ ముస్త్ బిజ్లీ యోజన’ పేరుతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా సోలార్ విద్యుత్తును పొందడం ఇక ఈజీ. ఈ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది.
ఉచిత విద్యుత్తే లక్ష్యంగా…
ప్రజలకు ఉచిత విద్యుత్తును అందించే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరిలో ‘పీఎం సూర్య గృహ ముఫ్త్ బిజ్లీ యోజన’ పేరుతో కొత్త పథకాన్నిప్రవేశ పెట్టారు. దీనిని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. తెలంగాణలోనూ ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాలను ఎంచుకొని సోలార్ విద్యుత్ సరఫరాకు ముందడుగు వేశారు.
Rooftop Solar Scheme : సోలార్ విద్యుత్తు ఇప్పుడు చాలా ఈజీ
‘పీఎం సూర్య గృహ ముఫ్త్ బిజ్లీ యోజన’ (PM Surya Ghar Muft Bijli Yojana) పేరుతో అమలు చేస్తున్న పథకం ప్రయోజనాలను పొందడం చాలా సులభం. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది. తద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంటిపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసువచ్చు.
సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు మొదటి విధానం
ప్రధాన మంత్రి సూర్య గృహ ఉచిత విద్యుత్ పథకం కింద మీరు సోలార్ ప్యానెల్స్‌ను ఓ థర్డ్ పార్టీ ద్వారా మన ఇంటిపై ఇన్‌స్టాల్ చేస్తారు. ఇందుకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్యానెల్ ఏర్పాటు చేసిన తర్వాత దాని ద్వారా ఉపయోగించే విద్యుత్తుకు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
రెండో విధానం ఏమిటంటే..
ULA (వాడుక-ఆధారిత ఇంటిగ్రేషన్) నమూనాలో DISCOMలు లేదా రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కంపెనీలు మీ ఇంట్లో సోలార్ పవర్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తాయి. దీనికి కూడా మీరు ఎలాంటి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సోలార్ పవర్ ప్యానెల్ ద్వారా ఉపయోగించే విద్యుత్తుకు డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.
పారదర్శకంగా నిర్వహణ
ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాల ప్రకారం సోలార్ విద్యుత్తు కోసం మరింత సులభంగా ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ పోర్టల్ ద్వారా ఈ ప్రక్రియ మరింత పారదర్శకంగా జరుగుతుంది. దీని ద్వారా సబ్సిడీ ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు.
pm surya ghar yojana 2025 : సబ్సిడీ ఎంతంటే..
‘పీఎం సూర్య గృహ ముఫ్త్ బిజ్లీ యోజన’ ద్వారా 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును పొందొచ్చు. దీంతోపాటు మీ ఇంటిపై సోలార్ రూఫ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సబ్సిడీని కూడా ఇస్తుంది. ఇందుకు నేరుగా మీ బ్యాంకు అకౌంట్‌లో డబ్బును జమా చేస్తుంది. 2 కిలోవాట్ల వరకు ప్యానెల్‌కు కేంద్రం రూ. 30 వేలు సబ్సిడీని, 3 kW పైన ప్యానెల్‌కు రూ. 48 వేల సబ్సిడీని అందిస్తుంది.
PM Surya Ghar Muft Bijli Yojana : దరఖాస్తు చేసుకోవడమెలా?
పీఎం సూర్య గృహ ముఫ్త్ బిజ్లీ యోజన ( PM Surya Ghar Muft Bijli Yojana ) కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే వెబ్‌సైట్ https://pmsuryaghar.gov.in ని సందర్శించొచచ్చు. ఆఫ్‌లైన్‌లోనైతే సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..