Hyderabad Breaking News | హైదరాబాద్ లోని మలక్ పేటలో ఈ రోజు ఉదయాన్ని కాల్పులు జరిపిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శాలివాహననగర్ పార్క్ లో వాకర్స్ పై ఓ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సీపీఐ (CPI) నాయకుడు చందు నాయక్ (43) మృతిచెందాడు. మంగళవారం శాలివాహన నగర్ పార్క్ వద్ద ఉదయం నడకకు వెళుతుండగా గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు.
వారి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తునున్న చందు రాథోడ్ వెంటాడి వెంబడించి గన్ తో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి కారులో పరారయ్యారు. దుండగులు. హత్య సమయంలో ఐదురుగు మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో చందు నాయక్ అక్కడికక్కడే మరణించాడు.
నాయక్ తోడుగా వస్తున్న ఆయన భార్య, కూతురు చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం నర్సాయిపల్లికి చెందిన చందు నాయక్ హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆధారాలు సేకరించడానికి ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.