Hyderabad floods 2025 : కొద్దిరోజులుగా భారీ వర్షాలు,వరదలతో అతలాకుతలమవుతున్న తెలంగాణకు ఐఎండీ మరోమారు వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలో మరో మూడురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్టోబర్ ఒకటి నాటికి ఉత్తర, దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వివరించింది. ఈ మేరకు వాతావరణశాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు, వరదల కారణంగా జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రహదారులన్నీ నీటమునిగాయి. హిమాయత్ సాగర్ గేట్లు ఒకేసారి ఎత్తడంతో మూసీ పోటెత్తింది. నగరవాసులకు పలు చోట్ల డ్రోన్ల ద్వారా ఇలా ఆహార పదార్థాలను అందజేస్తున్నారు. ఎంజీబీఎస్ ను పూర్తిగా మూసివేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    