Sarkar Live

Hyderabad : 48 గంటలు హై అలెర్ట్.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం

Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. నిమజ్జనం

Hyderabad Ganesh immersion

Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.

నిమజ్జనం కోసం కీలక ఏర్పాట్లు

  • 72 కృత్రిమ కొలనులు, 20 ప్రధాన సరస్సుల్లో నిమజ్జన సౌకర్యం
  • 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్‌లు సిద్ధంగా
  • హుస్సేన్ సాగర్‌లో 20 క్రేన్‌లు, బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం
  • 9 బోట్లు, DRF టీంలు, 200 ఈతగాళ్లు రెడీ
  • 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సజావుగా శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3 షిఫ్టులలో స్వచ్ఛత కార్యక్రమాలు 25 × 7 గంటలు విధుల్లో 15 వేలకు పైగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊరేగింపు జరిగే మార్గాలలో రోడ్లకు మరమ్మత్తులు పూర్తిచేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ నిమజ్జనం సాఫీగా, వేగంగా జరిగేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందు కోసం 11 పెద్ద క్రేన్లతో సహా 40 క్రేన్లు ఏర్పాటు చేశారు. బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) పరిధిలో ఈనెల 6 న జరిగే గణేష్‌ నిమజ్జన కార్యక్రమం సురక్షితంగా, ఎకో ఫ్రెండ్లీ విధానంలో సాఫీగా జరిగేలా జీహెచ్ఎంసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పూర్తి సన్నద్ధంగా ఉంది. నిమజ్జనం ముగిసే వరకూ జిహెచ్ఎంసి, పోలీస్, సమన్వయ శాఖలు హై అలెర్ట్ గా ఉండనున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, HMDA ,జలమండలి, ట్రాఫిక్ పోలీస్ , ఆర్ అండ్ బి, హైడ్రా, వైద్య ఆరోగ్య, పర్యాటక, సమాచార శాఖ లను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుంది.

72 కృత్రిమ కొలనుల ఏర్పాటు

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో 20 ప్రధాన చెరువులతోపాటు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 కృత్రిమ కొలనులలో నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు దూరం అవ్వడంతో పాటు భక్తులకు సౌలభ్యంగా ఉంటుంది. ప్రధాన జలవనరులపై ఒత్తిడి తగ్గనుంది.

134 స్థిర క్రేన్ లు, 259 మొబైల్ క్రేన్లు

ఒక బాహుబలి క్రేన్, 10 పెద్ద క్రేన్ లు సహా హుస్సేన్ సాగర్ చుట్టూ మొత్తం 20 క్రేన్ లు ఏర్పాటు చేశారు.ఫలితంగా కీలకమైన ఈ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం వేగంగా, స్మూత్ గా జరగనుంది. బాహుబలి క్రేన్ నెంబర్ 4 ద్వారా ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహం నిమజ్జనం చేయనున్నారు.

సురక్షిత నిమజ్జనంకు ప్రాధాన్యం

నిమజ్జన పాయింట్ ల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైడ్రా, పర్యాటకశాఖ సమన్వయంతో హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను, DRF టీం లను, 200 గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. పోలీసు సహకారంతో 13 కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. మొత్తం 303.3 కిలోమీటర్ల మేర ప్రధాన ఊరేగింపు మార్గంలో గణేష్ విగ్రహాల నిమజ్జన శోభాయత్రం సజావుగా జరిగేందుకు 160 గణేష్ యాక్షన్ టీం లను జీహెచ్ఎంసీ డిప్లాయ్ చేసింది. ఇప్పటికే ఈ మార్గంలో జీహెచ్ఎంసీ రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేసింది. శోభాయాత్రకు అనువుగా ఎలక్ట్రిసిటీ,
కేబుల్ వైర్ లను సరిచేసింది. చెట్ల కొమ్మలు తొలగించింది.

స్వచ్ఛతకు ప్రాధాన్యం

నిమజ్జన కార్యక్రమంలో స్వచ్ఛతకు పెద్దపీట వేసేలా 15 వేల మంది శానిటేషన్ వర్కర్స్ ను మూడు షిఫ్టులలో పని చేస్తున్నారు. వినాయక చవితి ప్రారంభం ఇప్పటి వరకూ 125 జీసీబీ లు, 102 మినీ టిప్పర్ లు ఉపయోగించి 10,500 మెట్రిక్ టన్నుల కు పైగా అధిక వ్యర్థాలను సేకరించి జవహర్ నగర్లోని ప్రాసెసింగ్ సెంటర్ కు తరలించారు. గణేష్ ప్రతిమల నిమజ్జనం జరిగే ప్రదేశాలలో 39 మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.

విద్యుత్ కాంతులు..

నిమజ్జనం జరిగే ప్రదేశాలతో పాటు ఊరేగింపు జరిగే మార్గంలో మొత్తం 56,187 టెంపరరీ లైటింగ్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. నిమజ్జనం పూర్తి అయ్యే వరకూ నూరు శాతం లైట్ లు పని చేసేలా అధికారులు మానిటర్ చేస్తున్నారు. నిమజ్జన పాయింట్ లలో మూడు షిఫ్టులలో పని చేసేలా అంబులెన్స్ లతో సహా 7 మెడికల్ క్యాంపులను సిద్దంగా ఉంచారు..

సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాలి: కమిషనర్

గణేష్ నిమజ్జనం సజావుగా , సాఫీగా జరిగేలా చూస్తున్నామని కమిషనర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. సకాలంలో గణేష్ ప్రతిమలను నిమజ్జనానికి తరలించాల్సిందిగా కమిషనర్ నిర్వాహకులకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. గణేష్ ప్రతిమల ఊరేగింపు జరిగే మార్గాలలో నిర్దేశించిన గార్బేజి పాయింట్లు లోనే చెత్తను వేయాలని ప్రజలను, భక్తులను కమిషనర్ కోరారు. కలర్ పేపర్ ముక్కలు ఊరేగింపులో ఎగురవేయవద్దని భక్తులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీటిని తొలగించడం కష్టతరమని, ప్రయాణికుల కళ్లలో పడతాయని , పర్యావరణానికి హాని చేస్తాయని చెప్పారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?