HCU Land dispute : హైదరాబాద్ విశ్వవిద్యాలయ (University of Hyderabad) భూ వివాదం (Land dispute) ముదిరింది. విద్యార్థుల సంఘం (UoHSU) మంగళవారం నుంచి నిరవధిక నిరసనను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఐటీ అభివృద్ధి, ఇతర మౌలిక సదుపాయాల కోసం కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లోని 400 ఎకరాల ఈ యూనివర్సిటీ భూమిని ఉపయోగించాలని నిర్ణయించగా విద్యార్థులు (students) దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ భూమి తమ విద్యాలయ పరిధిలోకి వస్తుందని, ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవడం తగదని వాదిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ నిరసనలో పాల్గొని తరగతులను బహిష్కరించాలని (boycott classes) యూవోహెచ్ ఎస్‌యూ ఉపాధ్యక్షుడు ఆకాష్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు చేస్తున్న నిరసనల (protesting)ను పోలీసు శాఖ అణచివేయడానికి యత్నిస్తోందని విమర్శించారు.
HCU Land dispute : ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత
గత ఆదివారం ఆ భూమి వద్ద భద్రతా సిబ్బంది, తవ్వక యంత్రాలు కనిపించడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. మార్చి 30న తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభించింది. దీనిపై విద్యార్థులు ఆందోళనకు దిగగా 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేశారు. విద్యార్థులు మాత్రమే కాకుండా పర్యావరణ కార్యకర్తలు (environmental activists) కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. అక్కడి జీవవైవిధ్యాన్ని నాశనం చేయకుండా భూమిని రక్షించాలని కోరుతున్నారు. భూమిపై అభివృద్ధి పనులు చేపట్టడం వల్ల స్థానిక పరిసరాలకు నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు.
యూనివర్సిటీకి హక్కుల్లేవ్ : టీజీఐఐసీ
కోర్టు తీర్పు మేరకు భూమి తమకే చెందుతుందని టీజీఐఐసీ (Telangana Industrial Infrastructure Corporation- TGIIC) స్పష్టం చేసింది. యూనివర్శిటీకి ఆ భూమిపై ఎటువంటి హక్కులు లేవని తెలిపింది. ఏదైనా అభ్యంతరాలు లేవడాన్ని కోర్టు ధిక్కరించడం అవుతుందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి (A Revanth Reddy) ప్రభుత్వం ఈ భూమి అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని తెలిపింది.
భూవివాదంపై ప్రభుత్వ వాదనలు
యూనివర్శిటీ రిజిస్ట్రార్ అనుమతితో 2024లో భూసర్వే నిర్వహించామని, హద్దులను కూడా ఖరారు చేశామని ప్రభుత్వం తెలిపింది. దీనిపై యూనివర్సిటీ వర్గాలు మాత్రం 2006లో భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పటికీ హద్దుల గుర్తింపు సర్వే జరగలేదని పేర్కొంది. ఇప్పటి వరకు కేవలం ప్రాథమిక సర్వే మాత్రమే నిర్వహించినట్టు పేర్కొంది.
భూ హక్కులపై తర్జనభర్జనలు
తెలంగాణ ప్రభుత్వం భూమిని 2004లో స్వాధీనం చేసుకుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. యూనివర్శిటీ మాత్రం భూమి తమదేనని అంటోంది. ఇది రెండు వర్గాల మధ్య వివాదాస్పదంగా మారింది. భూమి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉందని, దీనిపై ఆక్షేపణలు (HCU Land dispute) చేయడం కోర్టు ధిక్కారమని ప్రభుత్వం పేర్కొంది. ఈ వివాదం విద్యార్థుల నిరసనలతో మరింత ముదిరింది. విద్యార్థులు, పర్యావరణవేత్తలు అభివృద్ధి పనులను వ్యతిరేకిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆ పనులను కొనసాగించాలని నిర్ణయించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..