Hyderabad Rains | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్, కృష్ణానగర్, మియాపూర్, చందనాగర్, మాదాపూర్, రాయదుర్గం, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల్లోని రహదారులు జలమయమయ్యాయి. యూసుఫ్‌గూడా కృష్ణానగర్ బి బ్లాక్‌లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో వాహనదారులు, ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్ అయింది. అర్‌పేట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి.
ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, యూసుఫ్‌గూడ, అర్‌పేట్, పంజాగుట్ట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. మరోవైపు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలు బారులుతీరాయి.
Rains in Telangana : మరో నాలుగు రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడు, నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే పలు జిల్లాల్లో గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    