Hyderabad Metro : హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం మెట్రో రైలుకు ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా, కాలుష్య రహితమైన ప్రయాణాన్ని అందిస్తున్నమెట్రో రైలు నగరంలోని అన్ని వర్గాలకు దగ్గరైంది. ఒక వైపు ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూనే మరోవైపు అనేక రికార్డ్‌లను సృష్టిస్తోంది.
అయితే భాగ్యనగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇక్కట్లను అధిగమించేందుక అలాగే వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఉద్యోగులు, విద్యార్థులు సైతం మెట్రో రైలు ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలులో రద్దీ బాగా పెరిగిపోయింది.
బిజినెస్ వేళల్లో కనీసం కాలు కూడా నిలపలేని పరిస్థితి నెలకొంటోంది. ట్రైన్లలో కూర్చుని సీట్లు దొరకడం గగణమైపోయింది. ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్‌మెంట్ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అయితే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. మెట్రో (Hyderabad Metro) ప్రయాణికుల రద్దీపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu) అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ప్రయాణికుల కోసం మెట్రో కోచ్‌ల సంఖ్యను పెంచే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు 3 కోచ్‌లతో పరుగులు పెడుతోంది. దీంతో రద్దీని నివారించేందుకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని శ్రీధర్ బాబు తెలిపారు.
మెట్రోను 3 కోచ్‌లతో నడిపేందుకు డిజైన్ చేసినట్లు తెలిపిన మంత్రి.. దాన్ని 6 కోచ్‌లుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఆరు కోచ్‌లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు మెట్రో అధికారులు, ఎల్ అండ్ టీ యాజమన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి వెల్లడించారు. ఇక కోచ్‌ల పెరిగితే, హైదరాబాద్ మెట్రోలో ప్రయాణికుల రద్దీ చాలవవరకు తగ్గుతుందని మంత్రి స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న ప్రయాణికుల కష్టాలు”