Hyderabad Metro : హైదరాబాద్ నగరమంతా మెట్రో సేవలు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అండర్ గ్రౌండ్ మార్గంలో మెట్రోలో ప్రయాణించే సదుపాయం నగరవాసులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు దిల్లీకి పరిమితమైన ఈ సౌకర్యం హైదరాబాద్ కూ రానుంది.
హైదరాబాద్ లో పెరిగిన రద్దీ కారణం కాగా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో రెండో దశ మెట్రో ప్రాజెక్ట్ పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మూడు కారిడార్ల ద్వారా నగరవాసులకు మెట్రో సేవలు అందుతుండగా, మరో 5 కారిడార్లు రానున్నాయని చెప్పవచ్చు. ఈ 5 కారిడార్ల నిర్మాణానికి 116.4 కిలోమీటర్లు మెట్రో రవాణా సాగుతుండగా, అండర్ గ్రౌండ్ మార్గం కూడా ఇందులో చేరనుంది. ఇది మియాపూర్ నుంమ్ర్ పటాన్ చెరువు వరకు డబుల్ డెక్కర్, నాగోలు నుంమ్ర్ ఎయిర్ పోర్ట్ వరకు 24 స్టేషన్లు నిర్మించాలని మెట్రో భావిస్తోంది.
అయితే ఇక్కడే అండర్ గ్రౌండ్ మార్గం ద్వారా మెట్రో రవాణా సౌకర్యం కల్పించి, నాలుగు స్టేషన్లను తగ్గించాలని కూడా ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో మెట్రో రైలు ఎండీ చర్చలు జరపగా, త్వరలోనే కార్యాచరణకు అన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. జనవరి మొదటి వారంలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రెండో దశ పనులు ప్రారంభం కానుండగా, ప్రతి కిలోమీటర్ కు మెట్రో మార్గం నిర్మాణానికి రూ.318 కోట్లు ఖర్చు అవుతుందని ఎండీ ఎన్.వీ.ఎస్ రెడ్డి చెబుతున్నారు. మొత్తం మీద హైదరాబాద్ నగర వాసుల మెట్రో కల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పూర్తిస్థాయిలో విస్తరించనుందని చెప్పవచ్చు.
3 thoughts on “Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుపై కదలిక”