Numaish 2025 postponed details | హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) షెడ్యుల్‌లో మార్పు జరిగింది. జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రతిష్ఠాత్మక ఎగ్జిబిషన్ (Numaish) ప్రారంభ తేదీని మార్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Dr Manmohan Singh)మరణంతో కేంద్ర ప్రభుత్వం ఏడుదినాల జాతీయ సంతాపాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Numaish ప్రత్యేకత ఏమిటంటే..
హైదరాబాద్‌లో ప్రతి ఏడాది నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (Exhibition) ఎంతో ప్రఖ్యాతిని పొందింది. ప్రతి సంవత్సరం జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య దీన్ని నిర్వహిస్తారు. మొదట 1938లో 50 స్టాల్స్‌తో ఇది ప్రారంభమైంది. ఇప్పుడిది భారతదేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా సందర్శకులను ఆకర్షిస్తోంది. షాపింగ్, వ్యాపారం, వినోదం, విశ్రాంతిని కలిపే ఈ ప్రదర్శన దేశం నలుమూలల నుంచి వచ్చే వేలాది మంది సందర్శకులను ఆకర్షిస్తోంది. విదేశాల నుంచి కూడా పర్యటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు.
మన సంస్కృతికి ప్రతీక Numaish
హైదరాబాద్ నుమాయిష్ మన సంస్కృతి, వినోదం, వ్యాపారానికి ప్రతీకగా నిలుస్తోంది. వేలాది మంది సందర్శకులతో ఇది కిటకిటలాడుతూ ఉంటుంది. వీరి భద్రత కోసం పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపడుతోంది. సీసీ టీవీ పర్యవేక్షణ (CCTV surveillance)తో బందోబస్తును ఏర్పాటు చేస్తారు. గత ఏడాది నుమాయిష్ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇది ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ యాప్ సందర్శకులకు ప్రదర్శనలో నావిగేషన్, షాపింగ్, ఫన్ జోన్ వివరాలను అందిస్తుంది.
ప్రారంభం ఎప్పటి నుంచంటే..
జనవరి 1న ప్రారంభం కానున్న ఎగ్జిబిషన్‌ను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం నేపథ్యంలో రెండు రోజులు వాయిదా పడింది. జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. దీనికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బి. సురేందర్‌రెడ్డి తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంటాయన్నారు.
టికెట్ ధర.. ప్రత్యేక రోజులు
నుమాయిష్ టికెట్ ధర ఈ సంవత్సరం టికెట్ ధర రూ. 40 నుంచి రూ. 50కి పెరగనుంది. ఈ సంవత్సరం నుమాయిష్‌లో మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా రోజులు కేటాయించారు. లేడీస్ డే జనవరి 9న జరగనుంది. చిల్డ్రన్ స్పెషల్ జనవరి 31న ఉంటుంది.
45 రోజుల వినోదం
హైదరాబాద్ ఎగ్జిబిషన్ 45 రోజులపాటు కొనసాగనుంది. ఈ సంవత్సరం వ్యాపార ప్రదర్శనతో పాటు సందర్శకుల కోసం మరింత వినోదాన్ని అందించనున్నారు. టికెట్ ధరలు పెరిగినా సందర్శకులను మరింత ఆకట్టుకొనేందుకు మరిన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Numaish : హైదరాబాద్‌లో నుమాయిష్.. షెడ్యుల్‌లో మార్పు”