Sexual Assault : హైదరాబాద్ (Hyderabad)లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక (Minor Girl)ను ట్రైన్‌లో ఓ యువకుడు లైంగిక దాడి (Train Sexual Assault) చేశాడు. ఆ దృశ్యాలను తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secundrabad Railway Station) పరిధిలో జరగ్గా బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు (Railway Police) నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Sexual Assault : ఘటన ఎలా జరిగింది?
ఒడిశాలోని రక్సెల్ పట్టణానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రముఖ ప్రదేశాలను చూడటానికి వచ్చింది. కుటుంబ సభ్యులు రక్సెల్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. రాత్రి 2 గంటల సమయంలో 15 ఏళ్ల బాలిక ట్రైన్‌లోని వాష్‌రూమ్‌కు వెళ్లింది. ఆమె ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన ఓ యవకుడు మెల్లగా ఫాలో అయ్యాడు. వాష్‌రూమ్‌లోకి వెళ్లిన వెంటనే లోపలికి దూరి లైంగికంగా వేధించడమే (Sexual Assault) కాకుండా తన ఫోన్‌తో వీడియోలు తీశాడు. ఈ హఠత్పరిణామంతో వణికిపోయిన బాలిక అక్కడి నుంచి తప్పించుకుని పరుగెత్తుకుంటూ వచ్చి జరిగిన ఘోరాన్ని తన తండ్రికి చెప్పింది. బాలిక మాటలు విన్న తండ్రి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే రైల్వే పోలీసులను సంప్రదించాడు. దీంతో పోలీసులు ఆ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడు ఎవరు?
నిందితుడు 25 ఏళ్ల యువకుడిగా పోలీసు గుర్తించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అతడు ఉద్యోగం చేస్తున్నట్లు కనుగొన్నారు. ప్రస్తుతం అతడిని ప్రత్యేక విచారణ కోసం రహస్య ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో (Protection of Children from Sexual Offenses) చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలిక వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ట్రైన్‌లోని CCTV ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..