Hyderabad Vijayawada expressway | హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రయాణం ఇక మరింత సులభం కానుంది. జాతీయ రహదారి (NH65)ని 8 లేన్లుగా విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా, ఈ భారీ ప్రాజెక్ట్ పనులు 2026 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈరోజు ప్రకటించారు.
ప్రతి రోజు భారీ ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్న ఇరురాష్ట్రాల ప్రయాణికులకు ఇది భారీ ఊరట లభించనుంది. ఈ రహదారిపై ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో 17 బ్లాక్స్పాట్లను గుర్తించి ఫ్లైఓవర్లు కూడా నిర్మించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. ఇటీవల దిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావించానని మంత్రి తెలిపారు.
కేవలం రెండు గంటల్లో హైదరాబాద్ నుండి విజయవాడకు
కొత్త రహదారి పూర్తయిన తర్వాత, ఆధునాతన సాంకేతికతతో నిర్మాణం జరిగే ఈ మార్గంలో ప్రయాణికులు హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండు గంటల్లో చేరుకోగలరని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరకు 230 కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్‌కు కూడా గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వెల్లడించారు. డిపిఆర్ సిద్ధమవుతున్నదని, త్వరలో నిర్మాణం మొదలయ్యే అవకాశముందని చెప్పారు. ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో గేమ్‌చేంజర్‌గా నిలుస్తుందని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. 
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    