Hydra News : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) తన జోరును పెంచింది. అక్రమ కట్టడాల కూల్చివేతలను ముమ్మరం చేసింది. తాజాగా హైదరాబాద్‌లోని మణికొండ మునిసిపాలిటీ (Manikonda Municipality) పరిధిలోని అనురాగ్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్ ప్రాపర్టీలో ఉన్న దుకాణ సముదాయాన్ని నేలమట్టం చేసింది. దీంతో నిర్వాసితులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్కాపురి కాలనీ (Alkapuri Colony)లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్ షెట్టర్స్ (Commercial shutters)ను అధికారులు తొలగించారు
అనుమతులు ఉన్నాయి : నిర్వాసితులు
అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా, పండ్లు, కూరగాయల దుకాణాలను తొలగించేందుకు హైడ్రా ఉపక్రమించింది. దీంతో షాపు యజమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ వద్ద అన్ని రకాల అనునమతులు ఉన్నాయని, ఇవి అక్రమ నిర్మాణాలు కావని వాగ్వాదానికి దిగారు. 2016లో HMDA నుంచి అనుమతులు, 2018లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందామని పేర్కొన్నారు. గోల్కొండ హోటల్స్ యజమాని ఎన్. రామిరెడ్డికి చెందిన అనుహర్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ద్వారార 110 యూనిట్లను కలిగిన ఈ అపార్ట్‌మెంట్‌ను కట్టారని, ఇందులో అక్రమ నిర్మాణం లేదా వాణిజ్య స్థాపనలు ఏవీ లేవని తెలిపారు.
అన్ని రకాల ఆధారాలూ ఉన్నాయి : రంగనాథ్
నిర్వాసితుల నిరసనలపై HYDRA కమిషనర్ ఏవి రంగనాథ్ స్పందిస్తూ ఇవి అక్రమ నిర్మాణాలని తమ వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని అన్నారు. 38 కుటుంబాల నుంచి తమకు ఫిర్యాదులు అందాయని, ఆ తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్‌ను అనధికారిక వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగిస్తుండటంతో రంగంలోకి దిగామని చెప్పారు.
పోలీసుల సహకారంతో చర్యలు
నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా ఉపక్రమించడంతో నిర్వాసితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో హైడ్రా అధికారులు మునిసిపాలిటీ, పోలీసుల సహకారంతో కూల్చివేతలను మొదలెట్టారు.
దీంతో అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్స్ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
One thought on “Hydra News | జోరు పెంచిన హైడ్రా.. హైదరాబాద్‌లో మళ్లీ కూల్చివేతలు”