హైదరాబాద్: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. ఈమేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్ మున్సిపల్ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. నిజాంపేట్ మునిసిపల్ కమిషనర్, బాచుపల్లి తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే నంబరు 334లో వెలిసిన అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ సిబ్బంది ఎక్సకవేటర్‌తో కూల్చివేశారు. తుర్కచెరువు బఫర్ జోన్‌లో ఉన్న నాలుగు గదులను కూడా నేలమట్టం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్ అధికారులు నరేందర్‌రెడ్డి, భానుచందర్, ప్రశాంతి పాల్గొన్నారు.
One thought on “Hydra | మళ్లీ రంగంలోకి హైడ్రా.. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ప్రారంభం”