HYDRAA హైదరాబాద్, ఇతర జిల్లాల్లో వ్యవసాయ భూముల కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా (HYDRAA) చీఫ్ ఎ.వి. రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. కొంతకాలంగా హైదరాబాద్ నగర శివారులో కొందరు వ్యవసాయ భూములను అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని, కొనుగోలు దారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వ్యాపారం పేరిట మోసం
వ్యవసాయ భూములను ప్లాట్లుగా అమ్మిన వారు తమను మోసించారని సోమవారం జరిగిన ప్రజావాణి (Prajavani Grievance Redressal) కార్యక్రమంలో అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఇవి HYDRAA దృష్టికి వచ్చాయి. ఇందులో ప్రజలు అక్రమంగా జరుగుతున్న వ్యవసాయ స్థలాల విక్రయాలపై తమ ఆందోళనను వ్యక్తం చేశారు. తెలంగాణ మునిసిపల్ చట్టం 2019 (Telangana Municipalities Act 2019), తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 (Telangana Panchayat Raj Act 2018) ప్రకారం వ్యవసాయ భూములను ఏ విధంగానూ ప్లాట్లుగా మార్చి విక్రయించడం నేరం. హైదరాబాద్ శివారులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రజలను రంగానాథ్ (HYDRAA chief A.V. Ranganath) అప్రమత్తం చేశారు. అధికార అనుమతులు లేకుండా వ్యవసాయ భూములను లేఅవుట్‌లు ((Illegal Layouts)గా మార్చడం పూర్తిగా చట్ట విరుద్ధమని, వాటిని కొనుగోలు చేయొద్దని ఆయన సూచిస్తున్నారు.
రైతులకు తెలియకుండానే భూముల విక్రయం
వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలి. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ అథారిటీఈ (HMDA) నుంచి లేఅవుట్ అనుమతులు తప్పనిసరి. అయితే.. వ్యవసాయ భూములను అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తులు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలతో చేతులు కలిపి, రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండానే లేఅవుట్‌లు మార్చుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

లేఅవుట్లు లేకుంటే ఏమవుతుంది?
అక్రమ లేఅవుట్ల వల్ల నగర ప్రణాళికకు భంగం కలుగుతుంది. భవిష్యత్తులో ఇంటి నిర్మాణాలకు నీటి, డ్రెయినేజీ సౌకర్యాలను కల్పించడం ఉండదు. ప్లాట్ల కొనుగోలుదారులు ఆస్తి పత్రాలకు సంబంధించి భవిష్యత్తులో చట్ట సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మోసాలపై ఫిర్యాదులు.. స్పందించిన HYDRAA
వ్యవసాయ భూములను అక్రమంగా విక్రయిస్తూ మోసగిస్తున్నారనే ఫిర్యాదులపై HYDRAA అధికారుల బృందం తక్షణమే స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది.
అక్రమంగా ఆక్రమించిన భూములు, పార్కులను, రహదారులను తిరిగి ప్రజల వినియోగానికి అందజేసే ప్రక్రియను వేగవంతం చేస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








