Hydraa Police Station | హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ(హైడ్రా) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది హైడ్రా కోసం ప్రత్యేకంగా మొట్టమొదటి పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు,కుంటలను కబ్జా చేసే వారిపై ఇక నుంచి హైడ్రా పోలీస్ స్టేషన్ (Hydraa Police Station) లో కేసులు నమోదు చేయనున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారిని ప్రభుత్వం నియమించనుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌కు కావలసిన పోలీస్ సిబ్బందిని కేటాయించాలని రాష్ట్ర డీజీపీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ప్రతీ సోమవారం గ్రీవెన్స్ సెల్
Hydraa Grievance cell : ప్రతి సోమవారం బుద్ధ భవన్ వేదికగా నగర ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇదివరకే నిర్ణయించిన విషయం తెలిసిందే.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులకు సంబంధించి ఆక్రమణలపై ప్రజలు నేరుగా ఈ గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు.
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్) నిర్వహిస్తారు. ప్రజావాణిలో ఫిర్యాదుదారులు ఆధారాలతో సహా రావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. మొదటగా వొచ్చిన 50 మంది ఫిర్యాదు దారులకు టోకెన్లు ఇచ్చి.. వాటిని ప్రాధాన్యతా క్రమంలో ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపిన కమిషనర్ తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..









1 Comment
[…] పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో హైడ్రా అధికారులు దృష్టి సారించారు. […]