IAS transfers : తెలంగాణ (Telangana) ప్రభుత్వంలో ముఖ్యమైన పరిపాలనా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం (State Government) స్థానచలనం కల్పించింది. ముఖ్యంగా సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా హైకోర్టు (High Court) ఆదేశాలను పక్కనపెట్టిన కారణంగా తీవ్ర విమర్శలకు గురై ప్రస్తుత బాధ్యతను కోల్పోయారు. ఆయన్ను ట్రాన్స్‌పోర్టు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ (Transport, Roads and Building department)కు ప్రభుత్వం బదిలీ చేసింది. ఇదే క్రమంలో అనేకమంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచలనం కల్పించిన సర్కారు కొత్త బాధ్యతలను అప్పగించింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారని…
సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన పట్టించుకోకపోవడంతో న్యాయస్థానం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఆయన చర్యలను ‘చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడం’గా పేర్కొంది. దీనిపై ఒత్తిడి తీవ్ర పెరగడంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఆయన్ను బదిలీ చేసింది. న్యాయ వ్యవస్థ ఆదేశాలను గౌరవించడం ప్రతి అధికారికీ తప్పనిసరి పేర్కొంది.
IAS transfers : ఎవరెవరికి ఏయే బాధ్యతలు?
ప్రభుత్వం చేసిన ఈ బదిలీల్లో ఇతర ఉన్నతాధికారులకు స్థానచలనం కలిగింది.
- ప్రస్తుతం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ (Syed Ali Murtaza Rizvi)కి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (GAD) ప్రధాన కార్యదర్శి హోదాలో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఈ బాధ్యతను ఇప్పటి వరకు నిర్వహిస్తున్న ఎం. రఘునందన్‌రావు FAC (Full Additional Charge) నుంచి తప్పించారు.
- వ్యవసాయం, సహకార శాఖ కార్యదర్శిగా ఉన్న ఎం. రఘునందన్‌రావు (Raghunandan Rao)ను వాణిజ్య పన్నుల కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న కె.హరితను ప్రభుత్వం మార్చింది. అదనంగా రఘునందన్‌రావు రవాణా కమిషనర్‌గా కూడా FAC హోదాలో నియమించింది.
- రవాణా శాఖలో పనిచేస్తున్న కె. సురేంద్ర మోహన్ (Surendra Mohan)ను వ్యవసాయం, సహకార శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయన ఈ హోదాలో కొనసాగుతూనే సహకార కమిషనర్, కోఆపరేటివ్ సొసైటీల రిజిస్ట్రార్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తారు.
- విద్యా శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఎం.హరిత (M Haritha)ను సిరిసిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఈ పదవిని ఇప్పటివరకు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ ఝా బదిలీ తర్వాత ఆమె ఈ బాధ్యతలను చేపడతారు.
- వాణిజ్య పన్నుల కమిషనర్‌గా ఉన్న కె.హరిత (K Haritha)ను ఇప్పుడు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలకు కీలకమైన పదవిగా పరిగణించబడుతుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    