Champions Trophy 2025 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్‌కు అల్టిమేటం జారీ చేసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ‘హైబ్రిడ్’ మోడల్‌ను అంగీకరించాలని లేకుంటే ఈవెంట్ నుంచి తప్పిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి-మార్చి 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు గాను శుక్రవారం సమావేశం జరిగింది. పాకిస్తాన్‌లో భద్రతా కారణాల దృష్ట్యా UAEలో టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించే ‘హైబ్రిడ్’ మోడల్‌ను పాకిస్తాన్ తిరస్కరించడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. సరైన భద్రత లేని కారణంగా పాకిస్తాన్‌కు వెళ్లకూడదని భారతదేశం నిర్ణయించుకుంది.
చాలా మంది ఐసిసి బోర్డు సభ్యులు పాకిస్తాన్ పరిస్థితి పట్ల సానుభూతి చూపినప్పటికీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (పిసిబి) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ‘హైబ్రిడ్’ మోడల్‌ను మాత్రమే ఆచరణీయ పరిష్కారంగా అంగీకరించాలని కోరారు. భారత జట్టు లేకుండా బ్రాడ్‌కాస్టర్‌లు పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు. ఈవెంట్ వాణిజ్య పరంగా విజయం సాధించాలటే అందులో భారతదేశ కచ్చితంగా భాగస్వామ్యం ఉండాల్సిందేనని ICC వర్గాలు భావిస్తున్నాయి. పాకిస్తాన్ రాజీకి అంగీకరించకపోతే టోర్నమెంట్‌ను పూర్తిగా వేరే ప్రదేశానికి, బహుశా UAEకి మార్చడానికి ICC సిద్ధమైనట్లు సమాచారం. లేకపోతే, ఐసిసి బోర్డు టోర్నమెంట్‌ను పూర్తిగా వేరే దేశానికి మార్చవలసి ఉంటుంది (యుఎఇ కూడా కావచ్చు) కానీ అది పాకిస్తాన్ లేకుండానే నిర్వహించనున్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి.
కాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత జట్టు (Indian Cricket Team) పాకిస్తాన్‌కు వెళ్లదని పేర్కొంది. ‘బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్కడ భద్రతా సమస్యలు ఉన్నాయని, అందువల్ల తమ బృందం అక్కడికి వెళ్లే అవకాశం లేదని చెప్పారు.
‘హైబ్రిడ్’ మోడల్‌ను ఆమోదిస్తే Champions Trophy 2025 ఇండియా మ్యాచ్‌లు UAEలో నిర్వహిస్తారు. పాకిస్తాన్ ఇప్పటికీ ఈవెంట్ కోసం కొన్ని హోస్టింగ్ హక్కులను కలిగి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, ఈ ఏర్పాటు వలన పాకిస్తాన్ USD 6 మిలియన్ల హోస్టింగ్ రుసుము, గేట్ ఆదాయాలతో సహా పెద్ద ఎత్తున ఆదాయాలను కోల్పోతుంది. టోర్నమెంట్ రీషెడ్యూల్ చేసినా, లేదా మారి్చనా PCB ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.