- ఆలస్యంగా వెలుగులోకి వస్తున్న సబ్ రిజిస్ట్రార్ భాగోతాలు..
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఘనుడు..
Illegal Registrations in Khammam | స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం ఆయనకు టూ మినట్స్ న్యూడుల్స్ చేసినంత ఈజీ.. ఈ విషయంలో ఆ సబ్ రిజిస్ట్రార్ రూటే సప”రేటు”గా ఉంటుందని, నిబంధనలకు విరుద్ధంగా వందలాది రిజిస్ట్రేషన్ లు చేయడంతో అక్రమ రిజిస్ట్రేషన్ లకే రా”రాజు” అని సదరు సబ్ రిజిస్ట్రార్ కు డాక్యుమెంట్ రైటర్లు, రియల్టర్లు బిరుదు కూడా ఇచ్చారట. ఉమ్మడి ఖమ్మం జిల్లా (Khammam District)లో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ గతంలో విధులు నిర్వహించిన చోట తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. బదిలీల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్లిన అధికారి అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు అధికారి స్టైల్ మగధీర సినిమాలోని డైలాగ్ లాగా ” ఒక్కొక్కన్ని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను”అనేలా ఉండేదట, సారుకు కావాల్సింది సమర్పిస్తే ఒక్కటి కాదు వంద డాక్యుమెంట్లకు కూడా ఒకే అనేవాడని, ఉద్యోగులతోపాటు, డాక్యుమెంట్ రైటర్లు గొప్పగా చెప్పుకుంటున్నారంటే.. ఆ అధికారి ఏ స్థాయిలో అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడ్డాడో అర్థం చేసుకోవచ్చు.
ఆలస్యంగా వెలుగులోకి…
ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ లు అన్నీ ఇన్ని కావని, అక్రమాలను సైతం సక్రమం చేయగల నేర్పరి అని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ కాకముందు ఆ ఆర్వో కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన కాలంలో అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. సార్ ను ప్రసన్నం చేసుకుంటే చాలు రిజిస్ట్రేషన్ లు ఇట్టే చేసేవాడని తెలిసింది. స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖ (Stamps and Registrations Department) నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా వందలాది డాక్యుమెంట్లు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో డాక్యుమెంట్ కు ఒక్కో రేటు తీసుకొని సదరు అధికారి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయాలంటే సారు తర్వాతే ఎవరైనా అని వరంగల్ (Warangal RO) ఆర్వో కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తుండడం కొసమెరుపు.
Registrations Deportment : విచారణ చేస్తే విస్తుపోయే అక్రమాలు..
Corruption Free Telangana : వరంగల్ ఆర్వో కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించి, ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ లపై విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే విస్తుపోయే అక్రమాలు బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. వరంగల్ ఆర్వో కార్యాలయంలో సదరు అధికారి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధుల్లో చేరిన రోజునుండి బదిలీ అయ్యే ముందురోజు వరకు రిజిస్ట్రేషన్ లు (Registrations ) చేసిన అన్నీ డాక్యుమెంట్ లను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తే సదరు అధికారి భాగోతాలు బయటకుకు వస్తాయని విశ్వసనీయ సమాచారం.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..