- గతంలో సస్పెండ్ అయినా తీరు మార్చుకోని సబ్ రిజిస్ట్రార్
- గుట్టుచప్పుడు కాకుండా జీవో నెం 257 ను అతిక్రమించి రిజిస్ట్రేషన్లు
రూల్స్ అంటే ఏమిటో లెక్కచేయకపోవడం కొంతమంది అధికారులకు అలవాటు. గతంలో జీవో నెం. 257 నిబంధనలను ఉల్లంఘించి సస్పెండ్ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్, మరోసారి అదే జీవోను ఉల్లంఘిస్తూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయన గతంలో నల్గొండ జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడి వార్తల్లో నిలిచారు. సస్పెండ్ అయినా తీరు మార్చుకోలేదు. ఇటీవల వరంగల్ (రూరల్)కి బదిలీ అయిన ఆయన, అక్కడ కూడా అదే తంతు కొనసాగించారు. రిజిస్ట్రేషన్ శాఖలో తాను నిజాయితీ పరుడినన్న పేరు కోసం ప్రయత్నించినా, అఫీసు లోపల గుసగుసలు మాత్రం వేరే కధ చెబుతున్నాయి.
Illegal Registrations in Warangal | ఆ సబ్ రిజిస్ట్రార్ నిబంధనలు అతిక్రమించడంలో ఘనాపాటి అని విశ్వసనీయంగా తెలిసింది.గతంలో నిబంధనలు అతిక్రమించి సస్పెండ్ అయినప్పటికీ అవేమి పట్టించుకోకుండా మళ్ళీ అదే రీతిలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేయడం ఆయనకే చెల్లింది. సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన సదరు సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) ప్రమోషన్ పొందిన అనతికాలంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జీవో నెం 257 కు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేయడంతో సస్పెండ్ అయిన విషయం అప్పట్లో స్టాంప్స్ &రిజిస్ట్రేషన్ శాఖలో సంచలనం సృష్టించింది.కొన్ని నెలల క్రితం బదిలీ పై వరంగల్ (రూరల్) కార్యాలయానికి వచ్చిన సదరు అధికారి సస్పెండ్ అయిన సంగతి మరిచి మళ్ళీ తన వక్రబుద్దితో గుట్టుగా అక్రమ రిజిస్ట్రేషన్ లకు పాల్పడడం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏ జీవో ను అతిక్రమించినందుకు సస్పెన్షన్ కు గురయ్యాడో మళ్ళీ అదే జీవో నెంబర్ 257 ను అతిక్రమించి రిజిస్ట్రేషన్ లు చేయడం కొసమెరుపు.
గుట్టుచప్పుడు కాకుండా..
స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలోనే తనంత నిజాయితీ పరుడైన సబ్ రిజిస్ట్రార్ ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal Destrict)లోనే ఎవరూ లేరు అనే స్థాయిలో ప్రచారం చేసుకునే సదరు అధికారి గుట్టుచప్పుడు కాకుండా జీవో నెంబర్ 257 కు తూట్లు పొడిచినట్లు ఆయన చేసిన రిజిస్ట్రేషన్ లను చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.వరంగల్ నగరంలోని ఓ వెంచర్ లో ఒకే ఇంటినెంబర్ తో అనేక ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన సదరు సబ్ రిజిస్ట్రార్ బదులుగా అమ్యామ్యాలు గట్టిగానే పుచ్చుకున్నారని కార్యాలయం లోపల, బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా “న్యూ అసెస్మెంట్” రిజిస్ట్రేషన్ లు చేసి గజానికి ఓ రేటు చొప్పున అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.పైన పేర్కొన్న రిజిస్ట్రేషన్ (Illegal Registrations) ల పై కనుక విజిలెన్స్ విచారణ చేస్తే గతంలో మాదిరిగానే సస్పెండ్ అయ్యే అవకాశం లేకపోలేదు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.