- అక్రమ రిజిస్ట్రేషన్ విలువ..పది లకారాల పైనేనని ప్రచారం
- నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసి కోట్లు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ?
- సబ్ రిజిస్ట్రార్ అక్రమ రిజిస్ట్రేషన్ లకు సాక్ష్యాలు ఇవే..
- సస్పెన్షన్ తప్పదని లీవ్ పెట్టినట్లు గుసగుసలు…
- విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్న కమిషనర్ (ఐ జీ) పట్టించుకోని జిల్లా రిజిస్ట్రార్…?
Illegal Registrations In Warangal : అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆ సబ్ రిజిస్ట్రార్ (Sub Registrar) సిద్ధహస్తుడని,అక్రమ రిజిస్ట్రేషన్ లు చేయడంలో పోటీ నిర్వహిస్తే గోల్డ్ మెడల్ సాధిస్తాడని కొంతమంది డాక్యుమెంట్ రైటర్ లు అంటున్నారు. సారుకు కావాల్సింది సమర్పిస్తే నిబంధనలతో పనే ఉండదని,తన ఇష్టానుసారంగా అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ ల పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ (కమిషనర్) వరంగల్ రిజిస్ట్రార్ ను ఆదేశించినట్లు తెలిసింది. వివరాల్లోకెళితే ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న అంజద్ అలీ వరంగల్ ఆర్వో కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న కాలంలో స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలు విరుద్ధంగా అనేక రిజిస్ట్రేషన్ లు చేసినట్లు తెలుస్తోంది.హన్మకొండ జిల్లాలో అక్రమ వెంచర్ లలోని అనేక ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి రియల్టర్ ల నుండి పెద్దమొత్తంలో ముడుపులు పుచ్చుకున్నాడని తెలుస్తోంది.ఎలాంటి పత్రాలు లేకుండా అదీ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా చూపెడుతూ అక్రమంగా రెండు రిజిస్ట్రేషన్ లు చేసినట్లు తెలుస్తోంది. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 10 లక్షల రూపాయల పైనే చేతులు మారినట్లు ఆరోపణలు రావడం గమనార్హం.సదరు సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్ లను విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తే సారు భాగోతం మొత్తం బయటపడుతోందని సమాచారం.
అక్రమ రిజిస్ట్రేషన్ (Illegal Registrations ) విలువ 10 లక్షల పైనే..?
వరంగల్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహించిన కాలంలో ఈ అధికారి అక్రమంగా అనేక రిజిస్ట్రేషన్ లు చేసి అందినకాడికి దండుకున్నట్లు తెలిసింది.సదరు అధికారి15-04-2024 రోజున రెండు డాక్యుమెంట్లు(8098/2024,8099/2024) నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్ చేసాడు. ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో 10 లక్షల రూపాయలకు పైగా చేతులు మారినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేయడం నేరం అని తెలిసినప్పటికీ డబ్బుల మీద ఉన్న వ్యామోహంతోనే ఈ రిజిస్ట్రేషన్ లు చేసినట్లు సమాచారం.
అంజద్ అలీ ప్రత్యేకమా..
స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ లు చేసిన చాలా మంది సబ్ రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి.గతంలో సురేంద్రబాబు, సంపత్, రాజేష్, ప్రవీణ్ ఇలా చెప్పుకుంటూపోతే అనేకమంది సబ్ రిజిస్ట్రార్ లను సస్పెండ్ చేసిన స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ “అంజద్ అలీ” విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అర్ధంకాని పరిస్థితి. స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖ (stamps and registration department) లో నిబంధనలు ఒక్కొక్కరికి ఒకలా ఉంటున్నాయని అంజద్ అలీ ని చూస్తేనే అర్ధం అవుతుందని గతంలో సస్పెండ్ అయిన ఓ సబ్ రిజిస్ట్రార్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎక్కడ తనను సస్పెండ్ చేస్తారోనని సదరు సబ్ రిజిస్ట్రార్ లీవ్ పెట్టడం విశేషం.ఇప్పటికైనా ఉన్నతాధికారులు సదరు సబ్ రిజిస్ట్రార్ ను సస్పెండ్ చేస్తారా? లేదా? అనేది రెండుమూడు రోజుల్లో తేలిపోనుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..