Sarkar Live

IMD Report : తెలంగాణలో వాతావరణ శాఖ హెచ్చరిక

IMD Report | తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి

IMD Report

IMD Report | తెలంగాణలో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఈ వర్షాలు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. వాతావరణ శాఖ ప్రకారం, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వాతావరణంలో తేమ శాతం తగ్గిపోయిన నేపథ్యంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశముంది?

గురు, శుక్రవారాల్లో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.ఈ ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని fe అధికారులు తెలిపారు. ఈ వర్షాలకు తోడు ఉరుములు, మెరుపులు కూడ ఉండే అవకాశం (IMD Report) ఉంది.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

IMD Report : ప్రజలకు సూచనలు:

  • ఆకస్మాత్తుగా వర్షాలు పడే అవకాశం ఉన్నందున రెయిన్‌కోట్ లేదా గొడుగు వెంట ఉంచుకోవాలి.
  • పంటలపై ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  • బలమైన గాలుల కారణంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు పడే ప్రమాదం ఉండటంతో బయట నడుస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి.
  • తక్కువ తేమతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల హీటు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది – తగిన శీతలపదార్థాలు తీసుకోవాలి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

error: Content is protected !!