Telangana Rain Alert : హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్న వేళ హైదరాబాద్ వాతావరన విభాగం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నగరంతోపాటు ఇతర జిల్లాల్లోని ప్రజలు రాబోయే ఐదు రోజులు తీవ్రమైన వేడిగాలుల వంటి పరిస్థితుల నుంచే ఉపశమనం పొందవచ్చని తెలిపారు. మే 7 బుధవారం వరకు తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాల్లో విస్తృతంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం తన అంచనా వేసింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇందులో ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ తదితర జిల్లాల్లో శనివారం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
అదే రోజు సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ సహా జిల్లాల్లో ఒక మోస్తరు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Rain Alert : మరికొన్ని జిల్లాల్లో ఇలా..
IMD-హైదరాబాద్ (Hyderabad) అంచనా ప్రకారం శనివారం నుంచి హైదరాబాద్, దాని పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరిలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి. శుక్రవారం వరకు, హైదరాబాద్ అంతటా అనేక ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్, 42 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి.
కొన్ని ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నప్పటికీ, ఉరుములు, ఈదురుగాలులు వచ్చే అవకాశం బుధవారం వరకు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (Warangal) , హన్మకొండ, హైదరాబాద్, జనగాంపేట, జిల్లాల్లో మే 7 వరకు పిడుగులు పడే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం వెల్లడించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.