Komuravelli Jatara 2025 : సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి జాతర జనవరి 19 నుంచి ప్రారంభమవుతోంది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మల్లన్న జాతర ప్రారంభమై సుమారు మూడు నెలలపాటు అంటే ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజున ముగుస్తుంది.
Komuravelli Jatara 2025 : ప్రతీ ఆదివారం సందడే సందడి..
జాతర రోజుల్లో ఆలయంలో ప్రతీ ఆదివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పెద్దం సంఖ్యలో భక్తులు ఇక్కడికి ముందుగానే వచ్చి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి స్వామివారి కల్యాణం జరిపించి మొక్కులను చెల్లించుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఇలా ఉంటే కొమురవెల్లి జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలు భక్తులు వస్తారు. తెలంగాణకు సంబంధించి ఉమ్మడి వరంగల్ తోపాటు హైదరాబాద్, కరీంనగర్, నల్లకొండ జిల్లాలకు చెందిన భక్తులు అధికంగా వస్తారు. తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక వద్ద సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని దేవాదాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా అగ్నిగుండాలు
ఇక, జాతర ముగింపు సందర్భంగా అగ్నిగుండం (Agni gundam) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. దీన్ని చూడడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. ఈ సారి మార్చి 23న రాత్రి ఈ కార్యక్రమాన్ని జరపనున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోనే రాత్రంతా జాగరణ చేసి.. కల్యాణ వేదిక సమీపంలో అగ్నిగుండాలను ఏర్పాటు చేస్తారు. 64 రోజుల పాటు సాగే ఈ జాతరకు సుమారు 25 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా.
అత్యంత కీలక ఘట్టం పెద్దపట్నం
Komuravelli Jatara 2025 కాగా, మూడు నెలలపాటు సాగే కొమురవెల్లి జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం. పెద్ద పట్నం (Pedda Patnam).. ఈ సారి ఫిబ్రవరి 2న అర్ధరాత్రి దీన్ని నిర్వహించనున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం తరఫున నిర్వహించే ఈ కార్యక్రమానికి జాతర మొత్తానికి హైలెట్‌గా నిలుస్తుంది. చౌదరీలు, ఒగ్గుపూజారుల ఆధ్వర్యంలో ఐదు రంగుల చూర్ణంతో 50 గజాల విస్తీర్ణంలో ఆకర్షణీయంగా పట్నాలు వేస్తారు. దీనికి సుమారు 3 గంటలకు పైగా సమయం పడుతుంది. మల్లన స్వామి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి పట్నంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముందుగా అర్చకులు పెద్దపట్నం దాటిన తర్వాత భక్తులు దాటి గర్భాలయంలోని మల్లికార్జున స్వామివారిని దర్శించుకుంటారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.