Operation Keller | కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని కెల్లర్ దట్టమైన అటవీ ప్రాంతంలో మంగళవారం, మే 13, 2025న భారత సైన్యం (Indian Armed Forces) ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించింది. షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు సంబంధించిన పక్కా సమాచారం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్ కు అందింది. దీంతో వెంటనే ‘ఆపరేషన్ కెల్లర్’గా కోడ్ నేమ్ తో సైనిక చర్యను ప్రారంభించిది.
సోషల్ మీడియా ప్లాట్ ఫాం X లో పోస్ట్ చేయబడిన అధికారిక ఆర్మీ ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ కెల్లర్ (Operation Keller) . మే 13, 2025న, #షోపియన్‌లోని షూకల్ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు రాష్ట్రీయ రైఫిల్స్ (Rashtriya Rifles) యూనిట్ ఇచ్చిన నిర్దిష్ట నిఘా సమాచారం ఆధారంగా, #ఇండియన్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో, ఉగ్రవాదులు భారీ కాల్పులు జరిపారు. దీని ఫలితంగా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ కొనసాగుతోంది.” ఈ ఎన్‌కౌంటర్ పక్కనే ఉన్న కుల్గాం జిల్లాలో ప్రారంభమై షోపియన్ వరకు విస్తరించిందని, అక్కడ జరిగిన భారీ కాల్పుల్లో ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది.
దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే నిర్దిష్ట సమాచారం ఆధారంగా, భద్రతా దళాలు అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఉగ్రవాదులు దళాలపై కాల్పులు జరిపిన తర్వాత సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా మారిందని, దీంతో ప్రతీకారం తీర్చుకున్నామని భద్రతా దళాలు తెలిపారు.
ఈ కాల్పుల్లో, ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలు అడవుల్లోని దట్టమైన అటవీ ప్రాంతంలో కనిపించడంతో వారు మరణించారని అధికారులు తెలిపారు.
Operation Keller ఎందుకు?
గతంలో, జమ్మూ కాశ్మీర్ (Jammu And Kashmir) పోలీసులు పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లు, గుర్తింపులను విడుదల చేశారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారని, ముగ్గురు ఉగ్రవాదులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల బహుమతిని పోలీసులు ప్రకటించారు. మరణించిన ఉగ్రవాదులను అనంతనాగ్‌కు చెందిన హుస్సేన్ థోకర్ అలియాస్ తల్హా భాయ్ అలీ భాయ్; సులేమాన్ అలియాస్ హసీం ముసాగా గుర్తించారు. ముగ్గురు ఎల్‌ఇటి కార్యకర్తలలో, మూసా, తల్హా పాకిస్తాన్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు, థోకర్ కాశ్మీరీ స్థానికుడుగా గుర్తించారు.
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో భారతదేశం అద్భుతమైన విజయం సాధించిన నేపథ్యంలో తాజా ఆపరేషన్ (Operation Keller) జరిగింది, ఇక్కడ జరిపిన దాడుల్లో పాకిస్తాన్‌లోని కీలక స్థావరాలలో దాదాపు 100 మంది ఉగ్రవాద కార్యకర్తలను నిర్మూలించారు. జైషే ప్రధాన కార్యాలయం భవల్పూర్, లష్కరే కీలక శిక్షణా స్థావరం మురిద్కే లక్ష్యంగా చేసుకొని దాడులు భారత ఆర్మీ జరిపింది
OPERATION KELLER
On 13 May 2025, based on specific intelligence of a #RashtriyasRifles Unit, about presence of terrorists in general area Shoekal Keller, #Shopian, #IndianArmy launched a search and destroy Operation. During the operation, terrorists opened heavy fire and fierce… pic.twitter.com/KZwIkEGiLF
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 13, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.