India vs Pakistan War Live Updates : భారత్ – పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ ప్రారంభించిన డ్రోన్, క్షిపణి దాడిని మన భారత సాయుధ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి. సిందూర్ ఆపరేషన్‌లో భాగంగా భారత సాయుధ దళాలు వేగంగా చర్య తీసుకున్నాయి, ఎటువంటి నష్టాలు లేకుండా
పాక్ క్షిపణులను ఆకాశంలోనే పేల్చివేస్తున్నాయి.
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (HQ IDS) ప్రకారం, పాకిస్తాన్ జమ్మూ, పఠాన్‌కోట్, ఉధంపూర్‌తో సహా అనేక భారతీయ సైనిక స్థావరాలు, పౌర ప్రదేశాలను పాక్ లక్ష్యంగా చేసుకుంది, క్షిపణుల దాడి, పేలోడ్‌లను మోసుకెళ్ళే 50 కి పైగా డ్రోన్‌లను ఉపయోగించింది. అయితే, భారతకు చెందిన బలమైన వైమానిక రక్షణ వ్యవస్థలు – L-70 తుపాకులు, Zu-23mm, షిల్కా వ్యవస్థలు, ఇతర అధునాతన కౌంటర్-UAS పరికరాలతో సహా – పాక్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నాయి.
కాగా జమ్మూ, పంజాబ్, రాజస్థాన్‌లలో నౌషేరాతో సహా అనేక సెక్టార్లలో పాకిస్తాన్ డ్రోన్‌లను పేల్చివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జమ్మూ, బికనీర్, జలంధర్, కిష్త్వార్, అఖ్నూర్, సాంబా, అమృత్‌సర్‌లలో పూర్తి బ్లాక్‌అవుట్‌లు అమలు చేశారు. మే 9 ఉదయం అమృత్‌సర్‌తో సహా వివిధ ప్రాంతాల నుండి సైరన్‌లు పేలుళ్లు సంభవించాయని నివేదించబడింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అన్ని సరిహద్దు కాపలా దళాల డైరెక్టర్ జనరల్‌లతో ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సత్వారీ, సాంబా, ఆర్‌ఎస్ పురా, అర్నియా, జైసల్మేర్ వంటి కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు (India vs Pakistan War ) జరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) దళాలు పూర్తిగా అప్రతమ్తంగా ఉన్నట్లు పేర్కొంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.