Indian Army Operation Sindoor : భారత్ పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పాకిస్తాన్.. మరోసారి భారత్ లోని అనేక ప్రదేశాలపై సాధారణ పౌరులే లక్ష్యంగా దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో భారత ఆర్మీ (Indian Army ) పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన F-16 మరియు JF-17 లను కూల్చివేసింది. గురువారం పాకిస్తాన్ భారతదేశంలోని అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే, భారత వైమానిక దళం విజయవంతంగా తిప్పికొట్టింది. భారత్ లోకి చొరబడిన డ్రోన్‌లను కూల్చివేసింది.
గురువారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్ ప్రాంతంలో పాకిస్తాన్ క్షిపణి దాడికి ప్రయత్నించింది, దీనికి భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వేగంగా స్పందించాయి. ఈ ప్రాంతంలోని వాయు రక్షణ వ్యవస్థలు పూర్తిగా యాక్టివ్ అయ్యాయి. రాబోయే ముప్పులను ముందే పసిగట్టి ఆకాశంలోనే వాటిని తుదముట్టించాయి. 70 కి పైగా క్షిపణులను గాల్లోనే నాశనం చేశామని, లక్ష్యాలకు ఎటువంటి నష్టం జరగకుండా నిరోధించామని వర్గాలు తెలిపాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.