Prison sentence : ఆస్ట్రేలియా (Australia)లో భారతీయ సామాజిక కార్యకర్త (Indian community leader) బలేష్ ధంఖర్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష (sentenced to 40 years in prison) పడింది. ఐదుగురు కొరియన్ యువతులను మోసపూరితంగా మత్తు మందు ఇచ్చి లైంగిక దాడి (sexually assaulting) చేశాడనే కేసులో సిడ్నీ డౌనింగ్ సెంటర్ జిల్లా కోర్టు న్యాయమూర్తి మైఖేల్ కింగ్ తీర్పు చెప్పారు. 40 ఏళ్ల శిక్షకాలంలో అతడికి 30 ఏళ్లపాటు పెరోల్ (non-parole period of 30 years) కూడా లభించదని ప్రకటించారు. ఈ తీర్పును వినే సమయంలో బలేష్ ధంఖర్‌లో ఎలాంటి భావోద్వేగాలు కనిపించకపోవడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
తప్పుడు ఉద్యోగ ప్రకటనలు.. పక్కా ప్రణాళిక
ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ ఇచ్చిన వివరాల ప్రకారం.. 43 ఏళ్ల బలేష్ ధంఖర్ (Balesh Dhankhar) ఆ దేశంలో భారతీయ కమ్యూనిటీ నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఉద్యోగాల కల్పన పేరుతో ప్రకటనలు (fake job advertisements ) జారీ చేసి మహిళా అభ్యర్థులను తన ఇంటికి లేదా దగ్గరలోని ప్రదేశాలకు పిలిపించే వాడు. అక్కడికి వచ్చిన యువతులకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడేవాడు. ఈ దారుణాల వీడియోలను రికార్డు చేసి తన లైంగిక సంతృప్తి కోసం వాటిని భద్రపరచుకున్నాడు.
Prison sentence : బలహీనతల ఆధారంగా దారుణాలు
ధంఖర్ తన తప్పుడు ఉద్యోగ ప్రకటనలకు వచ్చిన మహిళల వివరాలను ఒక ఎక్సెల్ స్పెడ్‌షీట్ (spreadsheet)లో నమోదు చేసుకునేవాడు. మహిళల రూపం, మేధస్సు ఆధారంగా రేటింగ్ ఇచ్చేవాడు. అతడు ఎంచుకున్న మహిళ ఎంత బలహీనంగా ఉంది.. తన ప్లాన్‌కు ఆమె అనుకూలంగా ఉందా? అనే విషయాలను నమోదు చేసుకొనేవాడు. దానికి అనుగుణంగా మహిళలను ట్రాప్ చేసి లైంగిక దాడికి పాల్పడే వాడు. ధంఖర్ బాధితుల్లో 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయసు ఉన్న యువతులు ఉన్నారని విచారణలో తేలింది. వారంతా లైంగిక దాడి జరిగే సమయానికి అపస్మారక స్థితిలో లేదా మత్తులో ఉన్నారు.
ఉన్నత లక్ష్యం కోసం వెళ్లి…
బలేష్ ధంఖర్ 2006లో ఇండియా నుంచి ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. ABC, బ్రిటిష్ అమెరికన్ టొబాకో, టయోటా, సిడ్నీ ట్రైన్స్ సంస్థల్లో డేటా విజువలైజేషన్ కన్సల్టెంట్‌గా పని చేశాడు. భారతీయ జనతా పార్టీ పేరిట ఓ ఉపగ్రహ గ్రూప్‌ను స్థాపించాడు. ఆస్ట్రేలియాలో భారతీయ సమాజ ప్రతినిధిగా వ్యవహరించే వాడు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..