Indian Railways | దక్షిణ మధ్య రైల్వే (SCR) కొత్త ట్రైన్లకు శ్రీకారం చుట్టింది. వారాంత అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ముఖ్యంగా చర్లపల్లి (Charlapalli)-శ్రీకాకుళం రోడ్డు(Srikakulam Road)- చర్లపల్లి మధ్య స్పెషల్ ట్రైన్లు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లు రెండు దిశల్లోనూ పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి. వీటి ద్వారా ప్రయాణికులకు అధిక ప్రయోజనం కలిగించేలా రైల్వే శాఖ ప్లాన్ చేసింది.
Indian Railways Special Trains : ప్రత్యేక రైళ్ల వివరాలు
- ట్రైన్ నంబర్ 07025 (చర్లపల్లి – శ్రీకాకుళం రోడ్)
- ప్రయాణ ప్రారంభ సమయం: ఫిబ్రవరి 21న రాత్రి 9:15 గంటలకు
- గమ్యస్థానం చేరుకునే సమయం: ఫిబ్రవరి 22న ఉదయం 12:15 గంటలకు
- మొత్తం ప్రయాణ వ్యవధి: సుమారు 15 గంటలు
- ట్రైన్ నంబర్ 07026 (శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి)
- ప్రయాణ ప్రారంభ సమయం: ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 2:15 గంటలకు
- గమ్యస్థానం చేరుకునే సమయం: ఫిబ్రవరి 23న ఉదయం 6:00 గంటలకు
- మొత్తం ప్రయాణ వ్యవధి: సుమారు 15 గంటలు 45 నిమిషాలు ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కడెక్కడ ఆగుతాయి?
- తెలంగాణలోని స్టేషన్లు: నల్లగొండ, మిర్యాగూడ
- ఆంధ్రప్రదేశ్‌లోని స్టేషన్లు: నడికుడి, పడుగురాళ్ల, సత్తెన్నపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడిపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, చీపురుపల్లి. ఈ ప్రత్యేక రైళ్లలోని కోచ్ వివరాలు:
ఈ రైళ్లలో విభిన్న తరగతుల కోచ్‌లు
- 2AC (సెకండ్ ఏసీ) : అధిక సౌకర్యంతో కూడిన కోచ్‌లు
- 3AC (థర్డ్ ఏసీ): మధ్యస్థ రేంజ్‌లో ఉన్న కోచ్‌లు
- స్లీపర్ క్లాస్: దీర్ఘ ప్రయాణం చేసేవారికి అనువైనది
- జనరల్ కోచ్‌లు : తక్కువ టికెట్ ధరతో సాధారణ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటాయి ఏలూరు స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Train No. 20707/20708) ఏలూరు స్టేషన్‌లో ఆగే సౌకర్యాన్ని మరో 6 నెలలపాటు పొడిగించింది.
ఏలూరు స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- ఏలూరు(Eluru)లో ఆగే సమయం: ఉదయం 9:49 గంటలకు
- ఆగే వ్యవధి: 1 నిమిషం
- విశాఖపట్నం నుంచి బయల్దేరే వందే భారత్ ఎక్స్‌ప్రెస్
- వందేభారత్ ఎక్స్ ప్రెస్ (Vandebharat Express) ఎలూరులో ఆగే సమయం: సాయంత్రం 5:44 గంటలకు
- ఆగే వ్యవధి: 1 నిమిషం ప్రత్యేక రైళ్లు ఎందుకు నడుపుతున్నారు?
- అధిక రద్దీ: వారాంతాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్గాల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటుంది.
- ప్రయాణికులకు అదనపు సౌకర్యం: ఇప్పటికే ఉన్న రైళ్లు పూర్తిగా బుక్ అవుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తుతోంది.
- అధిక డిమాండ్ ఉన్న మార్గం: గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం వంటి కీలక నగరాలను కలుపుతూ ఉండటం వల్ల ఈ ప్రత్యేక రైళ్ల (Special Trians )కు మంచి స్పందన ఉండే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








