Hyderabad : తెలంగాణలో అమలు అవుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Houses) కింద లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. తాజా విడతలో 13,841 మంది లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.146.30 కోట్లు జమ చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద ప్రభుత్వం రూ.1435 కోట్ల నిధులను విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
ఇళ్ల నిర్మాణ పురోగతి
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 1.29 లక్షల ఇళ్లు నిర్మాణంలో కొనసాగుతున్నాయి. సుమారు 20 వేల ఇళ్లు గోడల దశలో , 8,633 ఇళ్లు పైకప్పు దశలో ఉన్నాయని వెల్లడించారు. అలాగే, ఇప్పటికే పూర్తి అయిన ఇళ్లలో పలువురు లబ్ధిదారులు గృహప్రవేశం కూడా చేసినట్టు తెలిపారు.
ప్రతి సోమవారం నగదు జమ విధానం
ప్రతి సోమవారం, ఇళ్ల నిర్మాణ (Indiramma Houses ) పురోగతిని బట్టి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఈ విధానం వల్ల లబ్ధిదారులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవడానికి అవకాశం లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవ్వడానికి అవసరమైన ఇసుకను తక్కువ ధరకు అందించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీంతో లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








