Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ను సచివాలయంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ అనే విధంగా రెండో వసంతంలోకి అడుగుపెడుతున్నామని అన్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కల.. ఆ పేదల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఆనాడే కృషి చేశారి గుర్తు చేశారు. వ్యవసాయ భూమి పేదల ఆత్మగౌరవమని గుర్తించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చి పేదలకు భూములను పంచారని చెప్పారు. తెలంగాణలోనే దాదాపు 35 లక్షల ఎకరాల భూమిని ఇందిరా గాంధీ పంపిణీ చేశారని తెలిపారు.
రాష్ట్రంలో గుడి లేని ఊరు ఉందేమో కానీ… ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదని చెప్పారు. రూ.4వేలతో మొదలైన ఈ పథకం వైఎస్ హయాం వరకు రూ.లక్షా 21వేలకు చేరుకుందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిని 5లక్షల రూపాయలకు పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
లక్ష్యం ఎంతగా గొప్పదైనా అమలులో లోపాలు ఉండొద్దని సాంకేతికను జోడించామన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు దక్కాలనే ఉద్దేశంతో కొత్తగా మొబైల్ యాప్ ను తీసుకొచ్చామని, విధి విధానాలను కూడా సరళీకృతం చేసి లబ్ధిదారులకు వెసులుబాటు కల్పించామన్నారు. వారి స్థోమతకు అనుగుణంగా ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. పేదలకు న్యాయం జరిగేందుకు తీసుకోవాల్సిన అన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుందని రేవంత్ అన్నారు. మొదటి ఏడాదిలో నియోజకవర్గానికి 3,500 చొప్పున… 4.50 లక్షల ఇండ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చామని తెలిపారు. అత్యంత నిరుపేదలు మా మొదటి ప్రాధాన్యత దళితులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలు,పారిశుధ్య కార్మికులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెడర్స్ కు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఐటీడీఏ ప్రాంతాలను 2004 నుంచి 2014 వరకు 25 లక్షల 4 వేల ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తుచేశారు.
2 Comments
[…] మీకు బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పై హరీశ్‌రావు నిప్పులు […]
[…] అభ్యర్థులు అగ్నివీర్- జనరల్ డ్యూటీ, […]