Insult to Indian national flag : భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ( Indian External Affairs Minister S Jaishankar) లండన్‌లో పర్యటిస్తున్న క్రమంలో అక్కడ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఖలిస్తానీ (Khalistani) వాదులు ఆయన కారుకు అడ్డంగా వచ్చి నిరసన ప్రదర్శించారు. వీరిలో ఒక వ్యక్తి భారత జాతీయ పతాకాన్ని చించివేశాడు. ఇది మార్చి 4న జరగ్గా ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది.
Insult to Indian national flag : అసలేం జరిగింది?
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ లండన్‌లో (London) ద్వైపాక్షిక సమావేశాలకు హాజరయ్యారు. బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శితో వాణిజ్యం, వ్యూహాత్మక సహకారం, జియోపాలిటిక్స్ వంటి అంశాలపై చర్చించారు. మార్చి 9 వరకు ఆయన లండన్‌లో ఉండే అవకాశం ఉంది. మార్చి 4న లండన్‌లోని చతమ్ హౌస్ (Cahtham House) వేదికలో జరిగిన చర్చ అనంతరం జైశంకర్ తన కారు వైపు వెళ్తున్న సమయంలో ఖలిస్తానీ వాదులు (Khalistani extremists) ఆందోళన నిర్వహించారు. అప్పటికే అక్కడ బ్రిటిష్ పోలీసులు ఉన్నప్పటికీ ఆందోళనకారులను వెంటనే నియంత్రించడంలో విఫలమయ్యారు. ఒక ఖలిస్తానీ వ్యక్తి ఆకస్మికంగా మంత్రి కారును లక్ష్యంగా చేసుకుని పరుగెత్తి వచ్చి భారత జాతీయ పతాకాన్ని(Indian National flag) అవమానపరిచాడు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు
ఆందోళనకారుడు భారత పతాకాన్ని చించివేస్తున్న సమయంలో బ్రిటిష్ పోలీసులు అక్కడే నిలబడి చూడటమే తప్ప, తక్షణ చర్యలు తీసుకోలేదు. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. అయితే, కొంత సమయం తర్వాత పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఖలిస్తానీ ఉద్యమం ఎందుకు?
సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్నదే ఖలిస్తాన్ ఉద్యమం ముఖ్యోద్దేశం. ఇది 1980లో పంజాబ్‌లో తీవ్రతరం అయ్యింది. భారత ప్రభుత్వం దీన్ని అణచివేసింది. ఈ క్రమంలో ఖలిస్తాన్ మద్దతుదారులు విదేశాల్లో చురుగ్గా మారారు. ముఖ్యంగా కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఖలిస్తాన్ వాదులు భారత్ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
భారతీయుల్లో ఆగ్రహం
ఈ ఘటనపై భారతదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారత జాతీయ పతాకాన్ని అవమానపరిచిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. ఇలాంటి నిరసనలు మరోసారి జరగకుండా ఉండాలంటే భారత మంత్రుల విదేశీ పర్యటనల సమయంలో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. భారత రాయబార కార్యాలయాలకు మరింత భద్రత కల్పించాలని, అంతర్జాతీయ స్థాయిలో ఖలిస్తాన్ మద్దతుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..