ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు (Inter Results) వచ్చేశాయి. ఇంటర్ ఫస్ట్ (1st year), సెకండ్ ఇయర్ (2nd year) ఫలితాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రిలీజ్ చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం గతేడాది కంటే ఈసారి పెరిగిందని ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే హవా అని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం, ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం ఉతీర్ణత సాధించారు. మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చారు. కాగా ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు ఏమాత్రం చింత వద్దని అధైర్య ధైర్యం చెప్పారు. కాగా, ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులు తమ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in లో చూసుకోవచ్చని ఇంటర్మిడియట్ బోర్డు అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈసారి ప్రతీ విద్యార్థి మొబైల్ ఫోన్‌కు ఫలితాల లింక్ పంపనున్నట్లు వెల్లడించారు. లింక్‌పై క్లిక్ చేసి హాల్ టికెట్ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.