IPS Transfers : తెలంగాణలో మళ్లీ భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. తాజాగా 21 మంది ఐపీఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ట్రాన్ ఫర్ అయ్యారు. అదనపు డీజీ (పర్సనల్)గా అనిల్ కుమార్, ఎస్పీఎఫ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
IPS Transfers : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్ ఫర్ అయిన వారి జాబితా
- సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు,
- రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా,
- వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్,
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ,
- మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన,
- నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్,
- కామారెడ్డి ఎస్పీగా రాజేశ్ చంద్ర,
- నిజామాబాద్ సీపీగా సాయిచైతన్య,
- సంగారెడ్డి ఎస్పీగా పారితోష్ పంకజ్,
- కరీంనగర్ ఎస్పీగా గౌస్ ఆలం,
- ఆదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్,
- యాదాద్రి భువనగిరి డీసీపీగా ఆక్షాన్స్ యాదవ్,
- రాజన్న సిరిసిల్ల ఎస్పీగా మహేశ్ బాబాసాహెబ్,
- మంచిర్యాల డీసీపీగా ఏ భాస్కర్,
- సూర్యాపేట ఎస్పీగా నరసింహ,
- హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి,
- ఎస్ఐబీ ఇంటెలిజెన్స్ ఎస్పీగా సాయి శేఖర్,
- పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్,
- సీఐడీ ఎస్పీగా రవీందర్
వరంగల్ సిపి గా సన్ ప్రీత్ సింగ్
వరంగల్ పోలీస్ కమిషనర్ గా సన్ ప్రీత్ సింగ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సన్ ప్రీత్ సింగ్ 2011ఐపిఎస్ బ్యాచ్ కు చెందినవారు. 2012 సంవత్సరంలో ములుగు ఏ. ఎస్పీ, వరంగల్ రూరల్ ఓఎస్డిగా పని చేశారు. అనంతరం ఎల్.బి నగర్ డిసిపీగా, జగిత్యాల ఎస్పీ గాను పనిచేశారు. కాగా ప్రస్తుతం పోలీస్ కమిషనర్ గా ఉన్న అంబర్ కిషోర్ ఝా ను రామగుండం పోలీస్ కమిషనర్ గా బదిలీ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..