Israeli PM Benjamin Netanyahu Hospitalized : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Prime Minister Benjamin Netanyahu) అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. బెంజమిన్ నెతన్యాహుకు ఈ రోజు శస్త్ర చికిత్స (ఆపరేషన్) జరిగింది. ఈ మేరకు ఆయన అధికారిక కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలువడింది.
ఇప్పటికే ఆరోగ్య మస్యలు ఉండగానే…
మార్చి 2024లో నెతన్యాహు కీళ్లు సంబంధిత సమస్యతో జనరల్ అనస్థీషియాలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో ఉప ప్రధాని, న్యాయ శాఖ మంత్రి యారీవ్ లెవిన్ తాత్కాలిక ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 2023లో నెతన్యాహు గుండె వేగం సమస్య (అరిత్మియా) కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్ ద్వారా ఆయనకు పేస్‌మేకర్ అమర్చారు. ఆ తర్వాత ఆయన డీహైడ్రేషన్‌కు గురై వైద్యం పొందారు. తాజాగా ప్రోస్టేజ్ సమస్యతో నెతన్యాహు బాధపడుతున్నారు. దీంతో అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చేరారు. ఆదివారం ఆయనకు ఆపరేషన్ (prostate removal surgery) జరిగింది. ఈ వార్తను ఆయన అధికారిక కార్యాలయం ధ్రువీకరించింది.
కిడ్నీ ఇన్‌ఫెక్షన్.. ప్రోస్టేజ్
నెతన్యాహు యెరూషలేంలోని హడాసా మెడికల్ సెంటర్‌లో బుధవారం వైద్య పరీక్ష చేయించుకున్నారు. దీంతో మూత్రపిండ ఇన్‌ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇది సాదాసీదా ప్రోస్టేట్ (prostate) విస్తరణ కారణంగా ఏర్పడిందని షిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
Benjamin Netanyahu ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడంపై వివాదం
ఈ ఘటనల వల్ల ఇజ్రాయెల్‌లో నెతన్యాహు ఆరోగ్య స్థితిపై అనుమానాలు పెరిగాయి. ప్రధాన మంత్రిగా ఉన్న వ్యక్తులు ప్రతి సంవత్సరం తమ ఆరోగ్య నివేదిక (మెడికల్ రిపోర్టులు)ను విడుదల చేయాలని అక్కడ నిబంధన ఉంది. అయినప్పటికీ 2016 నుంచి 2023 వరకు నెతన్యాహు ఆరోగ్య నివేదికను విడుదల చేయలేదు. ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన వైద్య నివేదికలో నెతన్యాహు పూర్తిగా సాధారణ ఆరోగ్య స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఆయనకు పేస్‌మేకర్ సక్రమంగా పనిచేస్తోందని, గుండె సంబంధిత సమస్యలు గానీ ఇతర ఆరోగ్య సమస్యలు లేవని నివేదిక తెలిపింది.
యుద్ధ సంక్షోభం మధ్య ఆరోగ్య సమస్యలు
ఇజ్రాయెల్ తాజా వైమానిక దాడులు యెమెన్‌లో హౌతీ నియంత్రిత ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపాయి. హౌతీ తిరుగుబాటుదారులు ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు చేశారు. ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టింది. ఈ క్రమంలో అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడులు జరిగాయి. అయినప్పటికీ హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు కొనసాగిస్తున్నారు.
హమాస్ ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌పై జరిగిన భయానక దాడి 2023 అక్టోబర్ 7న తర్వాత ఇజ్రాయెల్ గాజాలో హమాస్, లెబనాన్‌లో హిజ్‌బుల్లా, సిరియాలో లక్ష్యాలను తాకడం, ఇరాన్‌తో సరిహద్దులో ఉద్రిక్తత లాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..