SpaDeX satellites De-docking : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలక విజయాన్ని సాధించింది. ఉపగ్రహాల డీ-డాకింగ్ ప్రక్రియ (SpaDeX (Space Docking Experiment) ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఈ రోజు ప్రకటించింది. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ఇది గొప్ప మైలురాయి అని పేర్కొంది. భవిష్యత్ అంతరిక్ష ప్రయాణాలకు ఇదెంతో కీలకమని తెలిపింది. ముఖ్యంగా భారతదేశం సొంతంగా అంతరిక్ష స్టేషన్ నిర్మించడానికి, చంద్రయాన్-4 మిషన్‌కు, గగన్‌యాన్ ప్రాజెక్ట్‌కు ప్రధాన భూమికను పోషించనుందని ఇస్రో వివరించింది.
satellites De-docking : అంతరిక్ష పరిశోధనలో గొప్ప మైలురాయి
SpaDeX మిషన్‌లో భాగంగా రెండు ఉపగ్రహాలు SDX01, SDX02లను కక్ష్యలో ప్రవేశపెట్టింది ఇస్రో. అంతరిక్షంలో డాకింగ్, డీ-డాకింగ్ సాంకేతికతను పరీక్షించడం SpaDeX మిషన్ ప్రధాన లక్ష్యం. డాకింగ్ అంటే ఒక ఉపగ్రహాన్ని మరొక ఉపగ్రహంతో అనుసంధానం చేయడం. డీ-డాకింగ్ అంటే వాటిని వేరుచేయడం. ఈ టెక్నాలజీ అంతరిక్ష ప్రయోగాలు, భవిష్యత్ స్పేస్ స్టేషన్‌ల నిర్మాణం, మానవ అంతరిక్ష ప్రయాణాలు వంటి అనేక రంగాల్లో అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ISRO అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి ఈ రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేయగలిగింది. దాదాపు రెండు నెలలపాటు ఈ ఉపగ్రహాలు అనుసంధానమైన స్థితిలో ఉండగా వాటిని విజయవంతంగా డీ-డాక్ చేయగలిగింది. ఇది భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో గొప్ప మైలురాయిగా నిలిచింది.
ఇస్రో లక్ష్యాలు ఏమిటంటే..
SpaDeX మిషన్ విజయవంతమైన అనంతరం ISRO భవిష్యత్ ప్రాజెక్టులపై మరింత దృష్టి సారిస్తోంది. భారతదేశం సొంతంగా ఒక అంతరిక్ష స్టేషన్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడనుంది. అంతరిక్షంలో నాసా (NASA), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA), రష్యా రోస్కోస్మోస్ (Roskosmos) లాంటి అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికే satellites Docking టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాయి. ఇప్పుడు ISRO కూడా ఈ టెక్నాలజీలో నైపుణ్యత సాధించి, భారతదేశాన్ని అంతరిక్ష శక్తిగా మరింత ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది. భవిష్యత్‌లో చంద్రయాన్-4 ద్వారా మరిన్ని అద్భుతమైన పరిశోధనలు చేయాలని ISRO భావిస్తోంది. ఈ మిషన్ ద్వారా చంద్రుడిపై కొత్త రహస్యాలను వెలికితీసేందుకు ప్రయోగాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గగన్‌యాన్ మిషన్ కూడా SpaDeX టెక్నాలజీ ద్వారా లాభపడనుంది. Docking & De-docking టెక్నాలజీ ద్వారా భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయాణికులను సురక్షితంగా పంపే మార్గాన్ని ISRO పరిశోధిస్తోంది.
హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి
ఇస్రో సాధించిన ఈ విజయంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదిక (X) లో పోస్టు చేశారు. SpaDeX ఉపగ్రహాల విజయవంతమైన డీ-డాకింగ్ ప్రక్రియ భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ ఘనతను సాధించిన ISRO శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఇది ప్రతి భారతీయుడికీ గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవతో ISRO ఇలాంటి అద్భుత విజయాలను సాధించగలుగుతోందని ఆయన తెలిపారు.
ప్రపంచంలోనే అగ్రగామి దిశగా..
ఇది భారతదేశం అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా మారేందుకు ఒక కీలకమైన అడుగుగా చెప్పొచ్చు. ఈ గొప్ప ప్రయోగ విజయంతో ISRO భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు మరింత ప్రేరణను పొందినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
2 Comments
[…] అంతరిక్ష ప్రయాణం ISSకి చేరుకున్న తర్వాత గత […]
[…] అంతరిక్ష పరిశోధన సంస్థ గతంలో 2008లో చంద్రయాన్ -1ను ప్రయోగించి, చంద్రుని ఉపరితలాన్ని […]