భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన సరికొత్త రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 జనవరి 29న ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి GSLV-F15/NVS-02 మిషన్‌ను ప్రయోగనించనుంది. ఇది ISROకు ఒక ప్రత్యేక ఘట్టం. ఇది శ్రీహరికోటలో జరిగిన 100వ ప్రయోగం ఇది.
GSLV-F15 ప్రాధాన్యం
శ్రీహరికోట నుంచి మొదటి రాకెట్ SLVను 1979 ఆగస్టు 10న ప్రయోగించిన ఇస్రో అనేక మైలురాళ్లు దాటుతూ సుదీర్ఘ ప్రయాణం చేస్తోంది. ఈ 46 ఏళ్లలో ISRO ఎన్నో విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసింది. కొత్తగా తన 100వ ప్రయోగాన్ని చేపడుతోంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో నూతన అధ్యాయనానికి నాంది పలుకుతోంది.
ISRO సుదీర్ఘ ప్రయాణం
GSLV-F15 (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ప్రయోగం ఇస్రోకు ప్రధాన మైలురాయి లాంటిది.
దీని ద్వారా NVS-02 శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బి (Geosynchronous Transfer Orbit) లో ఇస్రో ప్రవేశపెట్టనుంది.
భారత్ స్వదేశీ నావిగేషన్ NavIC
ఈ ప్రయోగం ద్వారా NVS-02 శాటిలైట్‌ను ఇస్రో ప్రయోగించనుంది. NavIC (Navigation with Indian Constellation) వ్యవస్థలో భాగంగా ఉండే రెండోతరం శాటిలైట్ ఇది. పోసిషన్, వేగం, సమయం (Position, Velocity, Timing – PVT) సమాచారాన్ని ఇది అందిస్తుంది. ఈ సేవలు భారతదేశం మాత్రమే కాకుండా సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకు అందుబాటులో ఉంటాయి. సరికొత్త సాంకేతికతో ఈ NVS-02 శాటిలైట్‌కు రూపకల్పన చేశారు. L1 ఫ్రీక్వెన్సీ బాండ్‌కు అనుకూలంగా సేవల నాణ్యతను మెరుగుపరుస్తుంది. దీని బరువు 2,250 కిలోలు.
NavIC సేవలు
NavIC ద్వారా రెండు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇందులో ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ (SPS). 20 మీటర్ల కంటే మెరుగైన స్థానాన్ని ఇది నిర్ధారిస్తుంది. 40 నానోసెకన్ల కంటే మెరుగైన సమయ కచ్చితత్వం అందిస్తుంది. రెండోది రెస్ట్రిక్టెడ్ సర్వీస్ (RS). ఇది ప్రత్యేక భద్రత అవసరాలకు ఉపయోగించబడుతుంది.
ISRO విజయయాత్రకు నూతన ఒరవడి
ISRO తన ప్రయోగాల్లో ఎన్నో సాంకేతిక విజ్ఞానాలను అందించింది. క్రయోజెనిక్ ఇంజిన్‌ల అభివృద్ధి నుంచి నావిగేషన్ సేవల విస్తరణ వరకు ప్రతి రంగంలోనూ గణనీయమైన పురోగతి సాధించింది. కొత్తగా ఈ GSLV-F15 ప్రయోగం ఇస్రోకే కాదు. భారత అంతరిక్ష పరిశోధనకు కూడా మరో మైలురాయిగా నిలుస్తుంది.
One thought on “GSLV-F15 : ఇస్రో అద్భుత ఆవిష్కరణ.. 100వ మైలురాయిగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్15 ప్రయోగం”