Sarkar Live

Allu Arjun | జయం మూవీని బన్నీ చేసుంటే ఎలా ఉండేది? చిన్నికృష్ణ కామెంట్స్ వైరల్

మూవీ ఇండస్ట్రీ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం మామూలే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun)నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పుష్ప 2 (Pushpa 2) మూవీ కలెక్షన్లు అయితే ఇండియన్ సినిమా లో టాప్

Allu Arjun

మూవీ ఇండస్ట్రీ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం మామూలే. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ (Allu Arjun)నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పుష్ప 2 (Pushpa 2) మూవీ కలెక్షన్లు అయితే ఇండియన్ సినిమా లో టాప్ 2 లో ఉంది. దాదాపు 1800 కోట్ల వసూళ్లు రాబట్టి తన రేంజ్ ను పాన్ ఇండియన్ లెవల్లో పెంచుకున్నాడు.

అయితే కెరీర్ స్టార్టింగ్ లో తన ఫస్ట్ మూవీకి భారీ ఎత్తున అనౌన్స్ చేశాక ఆ మూవీలో మరో హీరో యాక్ట్ చేశారట. ఈ విషయాన్ని స్టార్ రైటర్ చిన్నికృష్ణ (Chinni krishna) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంగోత్రి (gangotri)మూవీ కంటే ముందు జరిగిన విషయాలను చిన్నికృష్ణ చెప్పుకొచ్చారు.

మెగా బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రొడ్యూసర్ అశ్వినీదత్ (ashvinidat)ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేశారట. ఆ పార్టీకి చిన్నికృష్ణ కూడా వెళ్ళాడట. అక్కడ తేజ (Teja)డైరెక్షన్ లో అల్లు అర్జున్ ని లాంచ్ చేయాలని అనౌన్స్ చేశారట. ఆ తరవాత ఏమైందో కాని ఓ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ తేజ.. నితిన్ తో మూవీ చేస్తున్నట్టు న్యూస్ పేపర్ లో చూసి షాక్ అయ్యారట.

నేను కూడా హార్ట్ అయ్యా: చిన్నికృష్ణ

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు ఫస్ట్ మూవీ అనౌన్స్ చేసి పేపర్ లో వచ్చాకా అలా జరగడంతో అల్లు అర్జున్ ఫీలయ్యారని, అందులో నేను కూడా హార్ట్ అయ్యానని ఆనాటి సంగతులను చెప్పుకొచ్చారు. ఆ టైమ్ లో రాఘవేంద్ర రావు 100 సినిమా ప్లాన్ లో ఉన్నారు. అప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం రాస్తున్న స్టోరీని పక్కన పెట్టి అల్లు అరవింద్ కి ఫోన్ చేసి మీ కొడుకు ఫస్ట్ మూవీ ఒక సంవత్సరంలో రిలీజ్ అవుతుందని చెప్పా. అలా గంగోత్రి అల్లు అర్జున్ కి ఫస్ట్ మూవీ అయింది.

Allu Arjun : జయం మూవీ అల్లు అర్జున్ చేసుంటే…

చిన్నికృష్ణ స్టోరీ, రాఘవేంద్ర రావు టేకింగ్, కొత్త హీరోయిన్ అదితి అగర్వాల్ స్క్రీన్ ప్రెజెన్స్, కీరవాణి ఫెంటాస్టిక్ మ్యూజిక్ తో మూవీ బానే ఆడింది. జయం మూవీ అల్లు అర్జున్ కి పడుంటే ఏమయ్యేది అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నితిన్ హీరోగా వచ్చిన జయం సూపర్ హిట్టు అయినప్పటికీ అది అల్లుఅర్జున్ చేసుంటే తన కెరీర్ లో మంచి మూవీ అయి ఉండేదని కొందరు ఫ్యాన్స్ అనుకుంటుండగా, జయం అల్లు అర్జున్ కి అంతలా సెట్ అయ్యుండేది కాదని మరికొందరు వారి అభిప్రాయాలను చెబుతున్నారు. గంగోత్రి మూవీనే తనకి బాగా వర్కౌట్ అయిందని అనుకుంటున్నారు. ఇలా చిన్నికృష్ణ చేసిన కామెంట్స్ తో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?