Bhupalpally : భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం జరిగిన దారుణ హత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవినీతిపై పోరాడుతున్న ఓ సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగం మూర్తి (Nagavelli Rajalinga Murthy)ని పేగులు బయటపేడేలా పొడిచి చంపడం కలకలం రేపింది. ఈ హత్య వెనుక కారణాలపై పోలీసులు ముమ్మరంగా విచారణ చేపడుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా పెద్ద ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని తెలిసింది. అవినీతిపై పోరాడుతున్న మూర్తి పోరాడుతుండటం వల్ల కొంతమందికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును CID లేదా SIT ద్వారా విచారణ చేపట్టాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.
ఉలిక్కిపడిన భూపాలపల్లి
మూర్తి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం సాయంత్రం 7:30 గంటల సమయంలో వెళ్తుండగా ఐదుగురు దుండగులు ఆయన్ను అడ్డుకున్నారు. ఆపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలపాలైన మూర్తిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందారని నిర్ధారించారు. ఈ ఘటనతో భూపాలపల్లి పట్టణం ఉలిక్కిపడింది. భారీ జన సంచారం ఉన్న ప్రాంతంలో అందరూ చూస్తుండగా ఈ హత్య జరగడం కలకలం రేపింది.
లింగమూర్తి హత్యకు కారణం?
నాగవెల్లి రాజలింగ మూర్తి రైతు కుటుంబానికి చెందిన వారు. రాజకీయ నేతగానే కాకుండా సామాజిక కార్యకర్తగా ఆయనకు పేరుంది. ఆయన భార్య భూపాలపల్లి మునిసిపల్ కౌన్సిలర్‌గా కొనసాగారు. ఇటీవల వీరిద్దరూ తమ సొంత పార్టీనే విభేదించి బయటకు వచ్చేశారు. వివిధ రంగాల్లో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగంపై మూర్తి న్యాయ పోరాటాలు చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు (Medigadda barrage)లో భారీ కుంభకోణం జరిగిందని ఆయన భూపాలపల్లి జిల్లా కోర్టుతోపాటు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (ormer Chief Minister K. Chandrashekhar Rao), నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్‌రావు (former Minister T. Harish Rao)తోపాటు మరికొందరిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉండగా రాజలింగమూర్తి హత్యకు గురయ్యారు. మరోవైపు పలు భూ తగాదాలు, సెటిల్మెంట్లలో కూడా మూర్తి ఇటీవల తలదూర్చారని తెలుస్తోంది. కొన్ని రోజులు ఈ వివాదాలు తీవ్ర రూపం దాల్చాయని సమాచారం.
సీరియస్‌గా తీసుకున్న సీఎం రేవంత్
సామాజిక కార్యకర్త హత్య కేసును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister of Telangana Revanth Reddy)
సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులు ఎంతటి వారినైనా ఉపేక్షించొద్దన్నారు. మరోవైపు ఈ ఘటనపై సీఐడీ లేదా సిట్ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశాలలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Bhupalpally Murder Case : ఐదుగురు నిందితుల అరెస్టు
నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో ఐదుగురిని పోలీసులు (Bhupalpally police) ఈ రోజు అరెస్టు చేశారు. రేణుకుంట్ల సంజీవ్, పింగిళి శ్రీమంత్, మోరే కుమార్, కొత్తూరి కుమార్, రేణుకుంట్ల కొమరయ్య అరెస్టు అయిన వారిలో ఉన్నారు. వీరిపై సెక్షన్ 191(2) -నేరపూరిత కుట్ర), సెక్షన్ 191(3) -ప్రణాళికా పద్ధతిలో హత్య, సెక్షన్ – 61(2)- ఆయుధాలతో దాడి, సెక్షన్ 126(2)- ఉద్దేశపూర్వక హింస, సెక్షన్ 103(2)- హత్య కేసులో సహకారం, 190 BNS -ప్రధాన హత్య సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..