Sarkar Live

JEE Main Admit Card 2025 | జేఈఈ అడ్మిట్ కార్డ్.. బిగ్ అప్‌డేట్‌

JEE Main Admit Card 2025 : జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు జతీయ పరీక్షా సంస్థ (NTA) సన్న‌ద్ధ‌మైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ

JEE Main Admit Card 2025

JEE Main Admit Card 2025 : జేఈఈ మెయిన్ 2025 అడ్మిట్ కార్డ్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేసేందుకు జతీయ పరీక్షా సంస్థ (NTA) సన్న‌ద్ధ‌మైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ అడ్మిట్ కార్డ్‌లో అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, పరీక్ష తేదీ, సమయం, పరీక్షా కేంద్రం వంటి కీలక సమాచారం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • సెషన్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల : పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా
  • సెషన్ 2 అడ్మిట్ కార్డ్ విడుదల : పరీక్ష తేదీకి మూడు రోజులు ముందుగా
  • సెషన్ 1 పరీక్ష తేదీలు: 2025 జనవరి 22 నుంచి 30 వరకు
  • సెషన్ 2 పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్ 1 నుంచి 8 వరకు

JEE Main Admit Card 2025 : అడ్మిట్ కార్డ్‌లో ఉండే సమాచారం

అడ్మిట్ కార్డులో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగం, కేటగిరీ, అర్హత, రాష్ట్రం, జేఈఈ మెయిన్ రోల్ నంబర్ త‌దిత‌ర వివ‌రాలు ఉంటాయి. పరీక్షా తేదీ, సమయం, పేపర్ వివరాలు, పరీక్షా కేంద్రం, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాల‌ను పేర్కొంటారు..

అడ్మిట్ కార్డ్‌లో తప్పులు ఉన్నట్లయితే?

అడ్మిట్ కార్డ్‌లో పేరులో తప్పు, పుట్టిన తేదీ, లింగం, కేటగిరీ, లేదా పరీక్షా కేంద్రం వివరాల్లో పొరపాటు ఉంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి.

జేఈఈ హెల్ప్‌లైన్

  • ఫోన్ నంబర్లు: 7703859909 / 8076535482
  • ఈ-మెయిల్: jeemain-nta@gov.in

పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన వ‌స్తువులు

  • అడ్మిట్ కార్డ్: ముద్రిత కాపీ తప్పనిసరి.
  • సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్: ఈ ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసి నింపాలి.
  • బాల్‌పాయింట్ పెన్: అభ్యర్థులు తమ పెన్ను వెంట తీసుకెళ్లాలి.
  • ఫొటో: అప్లికేషన్ సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటో ప‌రీక్ష స‌మ‌యంలో తీసుకెళ్లాలి.
  • నీటి బాటిల్: ట్రాన్స్‌పెరెంట్ వాట‌ర్ బాటిల్‌ను మాత్ర‌మే వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
  • మాస్క్, గ్లవ్స్: ప‌రీక్ష స‌మ‌యంలో ఎలాంటి ఆరోగ్య స‌మ్య‌ల‌కు గురికాకుండా వీటిని ధ‌రించాలి.
  • డయాబెటిస్ పేషెంట్లు: డయాబెటిస్ ఉన్నఅభ్య‌ర్థుల‌కు తాజా పండ్లు, చక్కెర గుళికలు, పారదర్శక నీటి సీసాలు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. అయితే.. ఇవి ప్యాక్ చేసి ఉండొద్దు.

నిషేధిత వస్తువులు

  • ఎలక్ట్రానిక్ పరికరాలు
  • గడియారాలు, జ్యువెలరీలు
  • బ్యాగులు, పర్సులు
  • ఖాళీ కాగితాలు లేదా స్టేషనరీ
  • మొబైల్ ఫోన్లు, హెడ్‌ఫోన్లు, పేజర్స్ లాంటి ఇత‌ర సాధ‌నాలు
  • మెటాలిక్ వస్తువులు

పరీక్షా నిబంధనలు

  • పరీక్షా కేంద్రానికి వేళకు చేరుకోవాలి.
  • నిర్దేశిత సీట్లో కూర్చోవాలి.
  • పరీక్ష ప్రారంభమైన త‌ర్వాత‌ ఎవరికీ ప్రవేశం ఉండదు.
  • అభ్య‌ర్థ‌లు తమకు కేటాయించిన రఫ్ షీట్స్‌లో మాత్రమే లెక్కలు వేయాలి.
  • ఇతరులను గమనించి ఎటువంటి గందరగోళానికి దారితీయకూడదు.

వెబ్‌సైట్ లాగిన్ సమస్యలు

  • పాస్‌వర్డ్ మర్చిపోయినట్లయితే అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి Forgot Password ఆప్షన్ ఎంచుకోండి.
  • రిజిస్ట్రేషన్ సమయంలో ఎంచుకున్న సెక్యూరిటీ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ద్వారా కొత్త పాస్‌వర్డ్ సెట్ చేయండి.

అప్లికేషన్ నంబర్ మర్చిపోతే..

  • Forgot Application Number లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు ఇచ్చి అప్లికేషన్ నంబర్ పొందండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?