Jio Voice Only Plans : ఇటీవల టెలికాం కంపెనీలు డేటా సేవల అవసరం లేకుండా కాలింగ్, SMS మాత్రమే అవసరమైన వినియోగదారులకు ప్రత్యేకంగా రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు (TRAI guidelines) జారీ చేసిన విషయం తెలిసిందే.. దీనికి అనుగుణంగా కాల్స్ మాత్రమే అవసరమైన వినియోగదారుల కోసం సరసమైన వాయిస్-ఓన్లీ ప్లాన్‌లను రిలయన్స్ జియో ప్రవేశపెట్టింది. రెండు కొత్త వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది. ఇది దీర్ఘకాలిక చెల్లుబాటు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. బడ్జెట్- ఫ్లెండ్లీ రీచార్జి ప్లాన్ల కోసం చూస్తున్న వినియోగదారులకు ఈ ప్లాన్‌లు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి.
Jio Voice Only Plans : జియో కొత్త తాజా వాయిస్ ఓన్లీ ప్లాన్‌లు
- జియో రూ. 458 రీఛార్జ్ ప్లాన్
- ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది
- ఇది భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్అందిస్తుంది
- ఈ ప్లాన్ కేవలం కాలింగ్, SMS లు మాత్రమే అవసరమైనవారికి ఉపయోగకరంగా ఉంటుంది.
జియో రూ. 1,958 రీఛార్జ్ ప్లాన్
- ఈ ప్లాన్ 365 రోజులు (1 సంవత్సరం) చెల్లుబాటులో ఉంటుంది,
- ఇది భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.
- ఇది ఉచిత జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది.
- మొత్తం 365 రోజుల పాటు 3,600 ఉచిత SMSలను పొందుతారు.
- మొబైల్ డేటా లభించదు.
- వినియోగదారులు జియో సినిమా జియో టీవీ యాప్‌లు Jioకి కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను పొందలేరు
- ఏడాది పొడవునా నిరంతరాయంగా కాలింగ్ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చే వినియోగదారుల కోసం ఈ ఏడాది కాల ప్రణాళిక రూపొందించబడింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..