Jobs in Germany : జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తెలంగాణ ఓవర్సిస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ కార్మిక, ఉపాధి, శిక్షణ కల్పన, ఫ్యాక్టరీల విభాగం ఆధ్వర్యంలో ఈ టామ్‌కామ్ సంస్థ నడుస్తోంది. ఆయా రంగాల్లో నైపుణ్యం కలిగిన తెలంగాణలోని నిరుద్యోగులకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశం కల్పించడం దీని ముఖ్యోద్దేశం.
TOMCOM తాజా ప్రకటన
Jobs For Telangana Youth విదేశాల్లో ఉన్నత వేతన ఉద్యోగాల అవకాశం కల్పిస్తున్న TOMCOM తాజాగా మరో ప్రకటన జారీ చేసింది. జర్మనీలో నర్సింగ్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
నర్సింగ్ ఉద్యోగాల వివరాలు
తెలంగాణలోని నర్సింగ్ నిపుణులకు జర్మనీలోని సుప్రసిద్ధ ఆస్పత్రుల్లో ఉద్యోగావకాశం కల్పిస్తోంది. జాబ్‌తోపాటు అందుకు అవసరమయ్యే అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థలు తెలంగాణలోని ఏదైనా గుర్తింపు పొందిన కళాశాలలో GNM లేదా బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయస్సు 21 నుంచి 38 సంవత్సరాల మధ్య ఉండాలి. ఏదైనా ఆస్పత్రిలో 1-3 ఏళ్లపాటు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
జర్మన్ భాషా నైపుణ్యం
Jobs in Germany జర్మనీలో నర్సింగ్ చేయడానికి ఇప్పటికే భాషా నైపుణ్యాలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నైపుణ్యం లేని వారికి TOMCOM సంస్థ శిక్షణ ఇస్తుంది. B2 స్థాయి వరకూ జర్మన్ భాషా శిక్షణను అందిస్తుంది. B1, B2 స్థాయిల్లో ఆన్‌లైన్ శిక్షణ పొందిన అభ్యర్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఉద్యోగ వివరాలు
- అభ్యర్థులు భాషా నైపుణ్య శిక్షణను పూర్తి చేసిన తర్వాత నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది.
- అనంతరం జర్మనీలో స్థిరమైన ఉద్యోగాలతో ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2.5 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు వేతనం పొందొచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
https://www.tomcom.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు
6302292450, 7901290580, 6302322257 ద్వారా సంప్రదించాలి.
డ్రైవర్ ఉద్యోగాలు
జర్మనీలో డ్రైవింగ్ ఉద్యోగాల (Driver jobs) కోసం అభ్యర్థులు కనీసం పదో తరగతి పాసై ఉండాలి. కనీసం రెండు సంవత్సరాల క్రితం జారీ చేసిన హెవీ మోటార్ వెహికల్ (HMV) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
అభ్యర్థులు 24 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
జర్మనీలో భాషా నైపుణ్యం:
అభ్యర్థులు జర్మన్ భాష(Germany Language) లో A2 స్థాయిలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఇందుకు TOMCOM ద్వారా సమగ్రంగా జర్మన్ భాషా శిక్షణను అందిస్తారు. తద్వారా A2 స్థాయికి అవసరమైన భాషా నైపుణ్యాలను అభ్యర్థులు పొందొచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 2,18,000 నెలసరి వేతనం ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
వెబ్‌సైట్: https://www.tomcom.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేయాలి. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు 9440052592, 8125251408, 9440049013, 9440049645 ద్వారా సంప్రదించాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు […]