Kadapa News | కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో ఇంటర్మీడియట్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసుల దర్యాప్తులో అనేక ముఖ్యమైన ఆధారాలు సేకరించారు. వైష్ణవి హత్యలో తన స్నేహితుడు లోకేశ్ పాత్ర లేదని డీఐజీ ప్రవీణ్ స్పష్టం చేశారు. విద్యార్థినిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. కాగా, ఎర్రగుంట్ల మండలానికి చెందిన వైష్ణవి గత సోమవారం కళాశాలకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టగా గండికోటలో విద్యార్థిని మృతదేహం లభ్యమైంది..
వైష్ణవి చివరిసారిగా స్నేహితులు లోకేష్ ద్విచక్ర వాహనంపై గండికోటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో అతనే హత్య చేశాడని కుటుంబం ఆరోపిస్తోంది. దీనితో పోలీసులు లోకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఇప్పటివరకు దర్యాప్తులో అతనికి హత్యకు సంబంధం లేదని డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టంగా చెప్పారు.
ఇదిలా ఉండగా కొన్ని మీడియా చానళ్లలో విద్యార్థిని మృతిపై అనేక వార్తలు వచ్చాయి. వైష్ణవి మృతికి తల్లిదండ్రులే కారణమంటూ పేర్కొన్నాయి. ఈ క్రమంలో మృతురాలి తల్లి దస్తగిరమ్మ మాట్లాడుతూ.. ‘మా బిడ్డను కోల్పోయిన బాధలో మేమున్నామని, కొన్ని మీడియా ఛానళ్లు తప్పుడు వార్తలు రాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని నచ్చినట్లు మాపై నిందలు వేస్తున్నాయి. లోకేశే మా బిడ్డను చంపాడని మాకు న్యాయం జరగాలంటే లోకేశ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.