Kamareddy News | కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో చెరువులు, కుంటలు నిండిపోయి మత్తడి పోస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రహిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది. జిల్లా కేంద్రంలో నలుమూలల వరద నీరుతో నిండిపోయింది. అనేక కాలనీలో జలమయమై కాలు బయటపెట్టే పరిస్థితి లేకుండా పోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో వరద నీరు చేరడంతో అక్కడివారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు చేర్చుతున్నారు. కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడు చూడని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన
హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం పేర్కొన్నారు. నదులు, వాగులపై ఉన్న లోతట్టు కాజ్‌వేలు, కల్వర్టులపై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాకపోకలు నిషేధించాలని సీఎం ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డులో ప్రధాన రహదారిపై వరదనీరు రావడంతో కార్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి పట్టణం అతి భారీ వర్షాలతో మునిగిపోయింది. #RainsInTelangana #KamareddyFloods #MedakFloods #rains #TelanganaFloods #TelanganaRains pic.twitter.com/GXNoULduPm
— Vande Bhaarath🚩 (@harithamithra1) August 27, 2025
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.