Ranya Rao Arrest : కన్నడ పినీ నటి రాన్యా రావ్ (Kannada film actress Ranya Rao) అరెస్టు అయ్యారు. 15 కేజీల బంగారంతో ఆమె పోలీసులకు పట్టుబడ్డారు. దుబాయ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru International Airport)లో ఫ్లైట్ దిగిన ఆమె డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు చిక్కారు. సినీ రంగంలో విశేష గుర్తింపు పొందిన రాన్యా రావ్ కర్ణాటకలోని ఓ పోలీసు ఉన్నతాధికారి (IPS officer) కూతురని, ఎవరికీ అనుమానం రాకుండా కొంతకాలంగా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ (gold smuggling) చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
విస్తుబోయిన DRI అధికారులు
రాన్యా రావ్ ఈనెల 3న రాత్రి దుబాయ్ నుంచి బెంగళూరు కంపెగౌడ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence -DRI) అధికారులు ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేశారు. ఇందుకు రాన్యా రావ్ అంగీకరించలేదు. అయినా అధికారులు ఆమెకు ఏమాత్రం వెసులుబాటు ఇవ్వలేదు. తమకు అనుమానం ఉందని, తనిఖీ చేయడానికి సహకరించాలని రాన్యా రావ్ (Ranya Rao Arrest)తో అన్నారు. తనిఖీలకు అంగీకరించకపోతే చట్ట రీత్యా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని డీఆర్ఐ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక రాన్యా రావ్ అంగీకరించారు. రాన్యా రావ్‌ను తనిఖీ చేసిన డీఆర్ఐ అధికారులు విస్తుబోయారు. ఆమె వద్ద వారికి 15 కేజీల బంగారం బిస్కెట్లు లభ్యమయ్యాయి. దుబాయ్ నుంచి దుస్తుల్లో దాచుకొని ఈ బంగారాన్ని ఆమె స్మగ్లింగ్ (Gold smuggling) చేస్తున్నారని గుర్తించారు. అనంతరం వెంటనే అరెస్టు చేసి ఈనెల 4న న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. రాన్యా రావ్‌కు న్యాయమూర్తి రిమాండ్ విధించగా డీఆర్ ఐ అధికారులు ఆమెను విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. అయితే.. రాన్యా రావ్‌ను 18 తేదీ వరకు (14 రోజులు) జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
హైప్రొఫైల్ సెక్యూరిటీ నడుమ స్మగ్లింగ్
రాన్యా రావ్ ఈ స్మగ్లింగ్‌ను కొంతకాలంగా చేస్తున్నట్టు తేలింది. స్వతహాగా ఆమె సెలబ్రిటీ కావడంతోపాటు పోలీసు ఉన్నతాధికారి కూతురు కావడంతో ఆమెపై ఎవరికీ అనుమానం రాలేదు. ఇటీవల ఆమె దుబాయ్‌కు తరచూ వెళ్లొస్తున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో ఆమె దిగడంతోనే పోలీసులు రక్షణ వలయంగా ఉంటూ కారు ఎక్కించడంతో ఆమె ఎన్ని రోజులుగా తప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది. సెలబ్రిటీతోపాటు పోలీసు ఉన్నతాధికారి కూతురు కావడంతో ఆమెకు హైప్రొఫైల్ సెక్యూరిటీ లభిస్తోంది. ఇదే అదునుగా భావించి ఆమె కొంతకాలంగా చాకచక్యంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    