Karimnagar Graduate MLC Election Results : కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో బిజెపి అభ్యర్థి అంజిరెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. మంగళవారం రాత్రి 12 గంటల వరకు 10 రౌండ్లు లెక్కించగా.. బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి కన్నా ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. అయితే వరుసగా 9 రౌండ్లలో ఆధిక్యం కనబరిచిన బీజేపీ.. 6వ, 7వ రౌండ్లలో మాత్రం వెనకబడింది. ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి 211 వోట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు.
ఇక ఏడో రౌండ్‌లో నరేందర్‌రెడ్డికి 600 పైచిలుకు వోట్ల ఆధిక్యం లభించినట్లు సమాచారం. ఇంకా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఈ నెల 3న వోట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. ఆ రోజంతా చెల్లని వోట్లను విభజించి కట్టలు కట్టడానికే సరిపోయింది. మంగళవారం ఉదయం అసలు వొట్ల లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 2,52,100 వోట్లు పోల్ కాగా.. వాటిలో 28,000 వోట్లు చెల్లుబాటు కానివిగా సిబ్బంది గుర్తించారు.
Karimnagar Graduate MLC Election Results : పది రౌండ్లలో ఫలితాలు ఇవి
1.అంజిరెడ్డి – 6869
(10 రౌండ్లు కలిపి (70740)
2.నరేందర్ రెడ్డి- 6347
(10 రౌండ్లు కలిపి (66178)
3.ప్రసన్న హరికృష్ణ – 5952
(10 రౌండ్లు కలిపి (56946)
4.రవీందర్ సింగ్ – 308
(10 రౌండ్లు కలిపి (1948)
5.మహమ్మద్ ముస్తాక్ అలీ – 379
(10 రౌండ్లు కలిపి (2504)
6.యాదగిరి శేఖర్ రావు – 324
(10 రౌండ్లు కలిపి (3439)
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








