Sarkar Live

COVID-19 Scam | కొవిడ్ ప‌రిక‌రాల స్కాం కేసులో సంచలన విషయాలు..

COVID-19 Scam Case : కర్ణాటకలో కరోనా మహమ్మారి సమయంలో వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై పోలీసులు తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఇది చోటుచేసుకుందని ఫిర్యాదు అంద‌డంతో ఈ మేర‌కు

COVID-19 Scam

COVID-19 Scam Case : కర్ణాటకలో కరోనా మహమ్మారి సమయంలో వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై పోలీసులు తొలి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పాలనలో ఇది చోటుచేసుకుందని ఫిర్యాదు అంద‌డంతో ఈ మేర‌కు కేసు న‌మోదైంది.

రూ. 167 కోట్ల కుంభ‌కోణం

కోరానా మహమ్మారి సమయంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు, N-95 మాస్కుల కొనుగోలులో అవకతవకలు జ‌రిగాయ‌ని, దీంతో ప్ర‌భుత్వ ఖ‌జానాకు రూ. 167 కోట్ల నష్టం వాటిల్లిందని కర్ణాటక వైద్య విద్యా డైరెక్టరేట్ (DME) కు చెందిన ఎం. విష్ణు ప్రసాద్ చేసిన ఫిర్యాదు చేశారు. ఈ కుంభ‌కోణంలో పూర్వ DME డైరెక్టర్ పి.జి. గిరీష్, ఆఫీసర్లు జి.పి.రఘు, ఎన్. మునిరాజు ప్ర‌మేయం ఉంద‌ని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో డిసెంబ‌రు 14న వారిపై ఎఫ్‌ఐఆర్ న‌మోదైంది. అయితే.. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఏ రాకీయ నాయ‌కుడిని కూడా నిందితుడిగా పేర్కొన‌లేదు.ఈ వార్త‌ను ది హిందూ ప‌త్రిక ప్ర‌చురింది.

COVID-19 Scam పై న్యాయ విచార‌ణ‌

క‌రోనా మ‌హ‌మ్మారి స‌మ‌యంలో పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు, N-95 మాస్కుల కొనుగోలులో అవకతవకలు జ‌రిగాయని వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేపథ్యంలో న్యాయ విచార‌ణ జ‌రిగింది. కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైకెల్ డి’కున్హా నేతృత్వంలోని కమిషన్ ఆగస్టులో తాత్కాలిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి బి.ఎస్. యడియూరప్ప, ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములపై కేసు నమోదు చేయాలని ఈ క‌మిష‌న్ సిఫార్సు చేసింది. 2020 ఏప్రిల్‌లో PPE కిట్ల కొనుగోలును రెండు కంపెనీలకు మేలు కూర్చాయ‌నే ఆరోప‌ణ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది.

న్యాయమూర్తి డి’కున్హా నివేదిక ఆధారంగా క‌ర్ణాట‌క రాష్ట్ర కేబినెట్ ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేయాల‌ని నవంబరులో నిర్ణ‌యించింది. SITను ఏర్పాటు చేయాలంటే ప్రత్యేకంగా ఎఫ్‌ఐఆర్‌ను సూచించాల్సి ఉంటుంది. ఈ నేప‌థ్యంలోలోనే డిసెంబ‌రు 14న ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఫిర్యాదులోని ముఖ్యాంశాలు :

  • PPE కిట్ల సరఫరాకు లాజ్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి 2020 సెప్టెంబ‌రులో కాంట్రాక్ట్ ఇచ్చారు. దీనికి చెల్లింపులు జరిగినప్పటికీ సంబంధిత వైద్య సంస్థలకు అవి సరఫరా అయినట్టు రికార్డు లేదని ఫిర్యాదు చేశారు.
  •  టెండర్ ప్రక్రియ లేకుండానే ముంబైలోని ప్రూడెంట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ కంపెనీ నుంచి రూ. 7.32 కోట్లతో 55,784 అదనపు PPE కిట్లు కొనుగోలు చేశార‌ని ఆరోపించారు
  •  రూ. 41.34 కోట్లతో 2.95 లక్షల PPE కిట్లను ప్రూడెంట్ కంపెనీ నుంచి టెండర్ ప్రకారమే కొనుగోలు చేసినప్పటికీ అవి స‌ర‌ఫ‌రా కాకముందే అదనంగా రూ. 13.16 కోట్లు చెల్లించార‌ని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత ..

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ ఓడించి కర్ణాటకలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా కిట్ల కొనుగోలుపై ద‌ర్యాప్తు చేప‌ట్ట‌డం నూత‌న రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఈ కేసు తర్వాతి దశలు, దర్యాప్తు పురోగతిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్, వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?