Karregutta: తెలంగాణ రాష్ట్రం (Telangana) ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతం ఆరు రోజులుగా దద్దరిల్లిపోతోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉండే ఈ గుట్ట ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్కడ భీకరమైన కాల్పుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. కేంద్ర భద్రతా బలగాలు, మావోయిస్టు (Maoists) దళాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కూంబింగ్ ఆపరేషన్ సమయం (Combing operation)లో ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు దాదాపు 38 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా వెలువడలేదు.
Karregutta : భద్రతా దళాల దూకుడు
Karregutta ప్రాంతంలో భద్రతా బలగాలు తమ కూంబింగ్ (combing operations)ను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల జాడ కోసం అడవి పొదలు, గుహలు, కొండలు అన్నీ జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టలను అన్ని వైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో మావోయిస్టులకు బయటకు పారిపోవడం అసాధ్యమైంది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు (security forces security forces ) ఒక పెద్ద సొరంగాన్ని గుర్తించారు. ఇది సుమారు వెయ్యి మంది మావోయిస్టులు తలదాచుకునేందుకు అనువుగా నిర్మించి ఉంది.. సొరంగం (A large tunnel) లోపల విశాలమైన మైదానం, నీటి సౌకర్యం, ఇతర అవసరమైన సదుపాయాలు ఉన్నట్లు గుర్తించారు. మావోయిస్టులు (Maoists)కొన్ని నెలలుగా ఈ సొరంగంలోనే నివాసం ఉండి కార్యకలాపాలు సాగిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టులకు డీహైడ్రేషన్?
కొండల్లో చిక్కుకున్న మావోయిస్టులకు తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం అందకపోవడంతో వారికి డీహైడ్రేషన్ సమస్య (Suffering Dehydration) తీవ్రమవుతోందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితి మరింత దెబ్బతినడంతో వారు సైనిక దాడులను తట్టుకోలేకపోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 90 కిలోమీటర్ల మేర సుదీర్ఘ గాలింపు చర్యలకు పోలీసులు దిగారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ములుగు జిల్లాలోని వెంకటాపురం సరిహద్దు ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి, భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంపరిధి వరకు సుమారు 90 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్ట ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. వేలాది మంది భద్రతా సిబ్బంది ఈ భారీ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు.








