Karthik Gattamneni Next Movie 2025 : మిరాయి మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamaneni). తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచిన మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ తో సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇప్పటికే దాదాపు 88 కోట్లు కొల్లగొట్టినట్టు మూవీ టీం ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇంతటి భారీ వసూళ్లు రీసెంట్ గా ఏ మూవీకి కూడా రాలేదు. కార్తీక్ ఘట్టమనేని కి డైరెక్టర్ గా ఇది రెండవ సినిమానే. ఫస్ట్ సూర్య వర్సెస్ సూర్య లాంటి ఎక్స్పరిమెంట్ మూవీ తీసి డీసెంట్ హిట్టు అందుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత మిరాయి లాంటి భారీ మూవీ తీసి ఆడియన్స్ ను థ్రిల్ చేశాడు.
కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni) డైరెక్టర్ కాకముందు సినిమాటోగ్రాఫర్ గా మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్స్ ప్రెస్ రాజా, ధమాకా, నిన్నుకోరి లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు.మిరాయి(mirayi)మూవీ కి డైరెక్షన్ తో పాటు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి పేరు తెచ్చుకున్నారు. అయితే రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో మూవీ ఛాన్స్ దక్కించుకున్నాడట.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో…
అయితే డైరెక్టర్ గా కాదు సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నారట. చిరు, బాబీ కాంబోలో ఒక మూవీ రాబోతుంది. వాల్తేరు వీరయ్య లాంటి భారీ హిట్టు తర్వాత వస్తున్న మూవీ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీలో కార్తీక్ ఘట్టమనేని భాగం కావడం అంచనాలను మరింత పెంచింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఫుల్ హ్యాపీ గా కార్తీక్ ఘట్టమనేని.. ?
ప్రజెంట్ చిరు వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర కంప్లీట్ చేసుకున్నారు. అలాగే అనిల్ రావిపూడి కాంబోలో సెట్స్ పై ఉన్న మన శివ శంకర వర ప్రసాద్ గారు మూవీ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఇవి కంప్లీట్ అయ్యాక బాబీ మూవీకి కొబ్బరికాయ కొడుతారు.డైరెక్టర్ గా మిరాయి మూవీ తో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కార్తీక్ ఘట్టమనేని.. సినిమాటోగ్రాఫర్ గా చిరు, బాబీ కాంబోలో రాబోయే సినిమా తో కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాడని ఫ్యాన్స్ ఊహించుకుంటున్నారు. మెగాస్టార్ తో పనిచేసే అవకాశం రావడంతో కార్తీక్ ఘట్టమనేని ఫుల్ హ్యాపీ గా ఉన్నారట.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    