Khammam News | ప్రముఖ టీవీ చానెల్ రియాలిటీ షో ‘ఢీ’ (‘Dhee’ show) డ్యాన్సర్ కావ్య కల్యాణి (Kavya Kalyani) ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన వ్యక్తి మోసగించాడనే మనస్తాపంతో అతడి ఇంట్లోనే ఖమ్మం (Khammam) జిల్లా పొన్నెకల్ (Ponnekal)లో ఈ రోజు ఉరి వేసుకొని బలవర్మరణానికి పాల్పడింది. ఈ వార్త ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.
ప్రేమ, సహజీవనం
ఖమ్మంలోని బ్యాంకు కాలనీకి చెందిన కావ్య కల్యాణి (Kavya Kalyani) డ్యాన్సర్. రియాలిటీ షో ఢీ (Dhee)తో ఆమె ఫేమస్ అయ్యింది. ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామానికి చెందిన అభిలాష్ అలియాస్ అభితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అభి కూడా డ్యాన్సర్ కావడంతో వీరిద్దరు దగ్గరయ్యారు. ఖమ్మంలోనే వీరు ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు.
ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం
కల్యాణితో అభి కలిసి ఉంటున్నా, వీరిద్దరి పెళ్లికి అతడి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పైగా మరో యువతితో పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. దీన్నిఅభి కూడా ఓకే అనేయడంతో కల్యాణి తీవ్రంగా మనస్తాపం చెందింది. ఈ విషయమై అభిని నిలదీసింది. అతడి కుటుంబ సభ్యులను అభ్యర్థించింది. అయినా వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో మరింత మనోవేదనకు గురైన కల్యాణ అతడి ఇంట్లోనే ఓ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అమ్మా.. క్షమించు..
ఆత్మహత్యకు ముందు కల్యాణి సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తనతో సహజీవనం చేసిన అభి మోసం చేశాడని, మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. అభి మోసం చేయడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపింది. “క్షమించు అమ్మా, నేను చస్తున్నాను. ఐదేళ్లు కలిసి ఉన్నాక, ఇప్పుడు అభి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నన్ను ఇంట్లోంచి వెళ్లిపోవాలని చెప్పాడు. నేను ఇక బతకలేను.” అని కన్నీటి పర్యంతమైంది.
Khammam పోలీసులకు లొంగిపోయిన అభి
కల్యాణి మరణానికి కారకుడైన అభి నేరుగా పోలీసుల వద్ద వచ్చి లొంగిపోయాడు. కల్యాణి కుటుంబ సభ్యులు మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. అభిలాష్‌పై హత్య కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








