Kazipet Coach Factory News | కాజీపేట రైల్వే కోచ్ పరిశ్రమ వరంగల్ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోచ్ ఫ్యాక్టరీ పనుల గురించి అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు.
అనంతరం అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీతో 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకో మోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో మెట్రో కోచ్‌లు కూడా తయావుతాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల నుంచి పోరాడామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నామని చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    